25న ఓటర్ల దినోత్సవం విజయవంతం జరుపుకుందాం

Collector

ఆసిఫాబాద్‌టౌన్ :  ప్రజాస్వామ్య వ్యవస్ద పటిష్టతకు ఓటరు న మోదు కార్యక్రమాన్ని పూర్తి స్దాయిలో విజయవంతం చేయాలని కలెక్టర్ చంపా లాల్ అన్నారు. గురువారం స్దానిక రాజస్వ మండలాధికారి కార్యాలయ సమా వేశ మందిరంలో తాహాసిల్దార్లు,జిల్లాపరిపాలనాధికారి,ఇంచార్జీ ఆర్‌డివో పాం డురంగారావుతో కలిసి 25 వ తేదీన జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం పై సమీక్ష నిర్వహించారు. ప్రతి పౌరుడు ఓటరుగా బాధ్యత నిర్వహించుటకు ఓటరు కార్డు గుర్తింపు పొందాలని,ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పటి ష్టపరిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం

ఈనెల 25వ తేదీన జరుపుకుంటున్నామని ,కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను అం దించ డంతో పాటు,కొత్త ఓటర్లను న మోదు చేయాలన్నారు.  నియోజకవర్గం,జిల్లా కేంద్రాలలో స మావేశం ఏర్పరచి ఓటు గురించి అ వగాహన కల్పించాలని,అందరి ము ఖ్యలను ఆహ్వానించాలన్నారు. ఈ నెల 21వ తేదీన రంగూళి కార్యక్ర మంప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఏ ర్పాటు పెయిటింగ్ కాంపిటేషన్, వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేసి ఉ త్తమ, ద్వితీయ, తృతీయగా గుర్తించి ప్ర సంశపత్రాలు అందజేసి వారిని జిల్లా స్దా యిలో నిర్వహించి ఈ కార్యక్రమాలకు పం పాలన్నారు.

ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఫోటోలు, వీడి యో తీయించాలన్నారు. 18 సంవ త్సరాలు నిం న యువతీ,యువకులకు ఓటు నమోదు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లాలోని తహసీల్దార్లు, ఇన్‌చార్జీ ఆర్‌డిఒ పాండురంగారావు, జిల్లా పరిపా లనాధికారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments