242వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర

YSRCP Chief Jagan Padayatra at Visakhapatnam

విశాఖపట్నం : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర మంగళవారంతో 242వ రోజుకు చేరుకుంది. కైలాసపట్నం శివారు నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ వైసిపి కార్యకర్త జగన్‌కు బుల్లి ఫ్యాన్‌ను బహుకరించారు. ఈ ఫ్యాన్ బ్యాటరీతో పని చేస్తుందని జగన్‌కు ఆ కార్యకర్త వివరించారు. మంగళవారం ఆయన పాదయాత్ర చౌడువాడ క్రాస్, గొట్టివాడ, పండూరు క్రాస్, రామచంద్రపురం క్రాస్ మీదుగా దార్లపూడి వరకు సాగనుంది. తన పాదయాత్రలో భాగంగా జగన్ టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

YSRCP Chief Jagan Padayatra at Visakhapatnam

Comments

comments