పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ వర్షాలు

Heavy Rain

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ని నీలుమ్ లోయలో కురిసిన భారీవర్షాల తర్వాత ఆకస్మికంగా వచ్చిన వరదల్లో 23 మంది మరణించారు. అనేకమంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. నీలుమ్ లోయలోని లాస్వా ప్రాంతంలో భారీగా ఇళ్లు దెబ్బతిన్నాయి. రాత్రికి రాత్రి ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా కురియడంతో వచ్చిన వరదల్లో డజన్లకొద్దీ ప్రజలు కొట్టుకుపోయారు. ‘లాస్వా ప్రాంతం బాగా దెబ్బతిన్నది. చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. మొత్తం మీద 23 మంది మరణించారు’ అని ప్రభుత్వ విపత్తు నిర్వహణ అథారిటీ ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ అల్ రెహమాన్ ఖురేషి చెప్పారు. మహిళలు, పిల్లలతో సహా అనేకమంది ఆచూకీ ఇప్పటికీ తెలీడం లేదు. లాస్వా ప్రధాన మార్కెట్‌లో రెండు మసీదులతో సహా అనేక కట్టడాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సర్వీసులు కూడా పనిచేయడం లేదు. జిల్లా యంత్రాంగం అధికారులు, విపత్తు నిర్వహణ అథారిటీ, స్థానిక పోలీసులు సహాయకార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. గతవారం ఒక హిమనదీయ సరస్సు ( గ్లేషియల్ లేక్) ఒడ్డు దాటి ఉప్పొంగడంతో చిత్రాల్ జిల్లాలో గోలెన్ గోల్ ప్రాంతంలో అనేక గ్రామాల్ని వరద ముంచెత్తింది. కరెంట్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లు, పంట పొలాలు నీళ్లలో మునిగిపోయాయి….అని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.

23 killed as thunderstorms and dust storm in Pakistan

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.