సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మందికి కరోనా

22 officials involved in rescue operation test positive for Corona

కోజికోడ్: కేరళ విమాన ప్రమాదం సందర్భంగా సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యాధికారి తెలిపారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్ లో ఉన్నట్టు వైద్యాధికారి తెలిపారు. దుబాయ్ లో ఉన్న భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నంలో ‘వందే భారత్ మిషన్’ కింద 184 మంది ప్రయాణీకులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తీసుకెళ్లింది. ప్రయాణికులతో కోజికోడ్ చేరుకున్న విమానం ల్యాండ్ అవుతూ రన్ వేపై ప్రమాదానికి గురైంది.  ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారికి గాయలయ్యాయి. ప్రమాదంలో గాయాలైన 150మందికి కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో విమానం రెండు ముక్కలైంది.

22 officials involved in rescue operation test positive for Corona

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మందికి కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.