కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

 

బర్మా: మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడడంతో 22 మంది మృతి చెందారు. మయాన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో మట్టిలో 16 గృహాలు కూరకపోయాయి. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి జెసిబిల సహాయంలో కొండచరియల కింద ఉన్న 22 మృతదేహాలను బయటకు తీశారు.  గాయపడిన 47 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కొన్ని కుటుంబాలే గల్లంతయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 89000 మంది సహాయక కేంద్రాలలో తలదాచుకున్నారు. మయన్మార్‌లోని మావ్లిమైన్ ప్రాంతంలో జాతీయ రహదారులపై 1.8 మీటర్ల మేర బురద పేరకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలలో బస్సు, రైల్వే సర్వీసులను రద్దు చేశారు. 100 మంది గల్లంతయ్యారని కొండచరియల కింద ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. వియత్నాలు భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పొటెత్తడంతో ఎనిమిది మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయినట్టు సమాచారం.

 

22 Members Dead in Landslides in Myanmar

The post కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.