ఘోర విమాన ప్రమాదం: 21 మంది మృతి

జుబా: దక్షిణ సుడాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జుబా సమాచార శాఖ మంత్రి టాబన్ అబెల్ తెలిపిన వివరాల ప్రకారం… జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్ నగరానికి బయలు దేరిన విమానంలో 19 మంది ప్రయాణం చేయడానికి అనుమతి ఉండాగా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించుకొవడంతో విమానం ఒక్కసారిగా సరస్సులో  కుప్పకూలి పోయింది. ఆ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చేందాగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. […]

జుబా: దక్షిణ సుడాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జుబా సమాచార శాఖ మంత్రి టాబన్ అబెల్ తెలిపిన వివరాల ప్రకారం… జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్ నగరానికి బయలు దేరిన విమానంలో 19 మంది ప్రయాణం చేయడానికి అనుమతి ఉండాగా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించుకొవడంతో విమానం ఒక్కసారిగా సరస్సులో  కుప్పకూలి పోయింది. ఆ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చేందాగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. సరస్సులో నుంచి మృతదేహలను సహయక బృందాలు బయటకు తీసే ప్రయాత్నం చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలియజేశారు. వారిలో ఆరు సంవత్సరాల అమ్మాయి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నారు. వీరిని దవాఖానకు తరలించగా అందులో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. 2017లో కూడా వాతావరణంలో మార్పుల కారణంగా ఓ విమానాన్ని అత్యవసరంగా దించే క్రమంలో మంటలు చేలారేగి నలుగురు అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. మరోసారి 2015లో జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ విమానం కుప్పకూలడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Comments

comments

Related Stories: