2019 జూన్ నాటికి 11,892కు నిఫ్టీ

అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా ముంబయి: ఏడాది జూన్ చివరి నాటికి నిఫ్టీ సూచి 11,892 స్థాయికి పెరగవచ్చని గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ సంస్థ నోమురా అంచ నా వేసింది. నోమురా బాటమ్- అప్ విధానాన్ని వినియోగించి ఒక పోర్ట్ ఫోలియోను రూపొందించింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు, అనిశ్చిత స్థూల ఆర్థిక అంశాలను పరిశీలించి ఈ పోర్ట్‌ఫోలియోను తయారు చేసింది. ధీర్ఘకాలిక – వృద్ధి అవకాశాలు, వ్యాపార నమూనాలు ఈక్విటీపై అధిక రాబడి అందించే […]

అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా

ముంబయి: ఏడాది జూన్ చివరి నాటికి నిఫ్టీ సూచి 11,892 స్థాయికి పెరగవచ్చని గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ సంస్థ నోమురా అంచ నా వేసింది. నోమురా బాటమ్- అప్ విధానాన్ని వినియోగించి ఒక పోర్ట్ ఫోలియోను రూపొందించింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు, అనిశ్చిత స్థూల ఆర్థిక అంశాలను పరిశీలించి ఈ పోర్ట్‌ఫోలియోను తయారు చేసింది. ధీర్ఘకాలిక – వృద్ధి అవకాశాలు, వ్యాపార నమూనాలు ఈక్విటీపై అధిక రాబడి అందించే కంపెనీలను నోమురా సూచించింది. వాల్యుయేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే నోమురా వినిమయ రంగ షేర్లకు అండర్‌వెయిటేజ్‌ను ఇచ్చింది. హెల్త్‌కేర్, ఎన్నుకోబడిన కొన్ని కార్పోరేట్ బ్యాంకులు, ఆటో, రిటైల్ బ్యాంకులు, ఎన్‌బిసిఎసి షేర్లుకు ఓవర్‌వెయిట్ ఇచ్చింది. ఇంకా తన పోర్ట్‌ఫోలియోలో పొటెన్షియల్ టర్న్‌అరౌండ్‌కు అవకాశాలున్న షేర్లు ప్రాధాన్యత కల్పించింది. నోమురో రూపొందించిన ఈ పోర్ట్ పోలియోలో మారుతి సుజుకీ, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, క్రాంప్టన్ గ్రీవ్స్, కుమ్మింగ్ ఇండియా, శ్రీ సిమెంట్స్, ఐటిసి, డాబర్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జస్ట్ డయల్ షేర్లు చోటు దక్కించుకున్నాయి.

అంతర్జాతీయ అంశాలే కీలకం
దేశీయ స్టాక్‌మార్కెట్లు బక్రీద్ సెలవు సందర్భంగా బుధవారం పనిచేయలేదు. దీంతో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లో ట్రేడింగ్ జరగలేదు. అలాగే మెటల్స్, బులియన్‌తో పాటు కమోడిటీ మార్కె ట్లు, కరెన్సీ మార్కెట్లకు కూడా బక్రీద్ సందర్భంగా హాలీడే ప్రకటించారు. ఫోరెక్స్, కమోడిటీ ఫ్యూచర్స్‌ల్లోనూ ట్రేడింగ్ జరగడం లేదు. దీంతో గురువారం మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి.మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం కొర్త రికార్డులను నెలకొల్పాయి. బ్లూచిప్స్‌తో కూడిన స్టాక్ ఇండెక్స్ ఎస్‌అండ్‌పీ-500 ఇంట్రాడేలో 0.6 శాతం లాభపడటం ద్వారా 2,873ను తాకింది. అమెరికా మార్కెట్ చరిత్రలో అత్యంత దీర్ఘకాలంపాటు బుల్ ట్రెండ్ కొనసాగినట్లు రికార్డ్ నమోదైంది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి డోజోన్స్ 64 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 25,822 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 6 పాయింట్లు(0.2 శాతం) బలపడి 2,863 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్ 38 పాయింట్ల(0.5 శాతం) లాభంతో 7,859 వద్ద ముగిసింది.

Comments

comments