సెమీస్‌లో సైనా

వుహాన్: చైనాలోని వుహాన్‌లో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంది శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ మలేసియా స్టార్ చాంగ్ వీ లి చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సింధు క్వార్టర్ ఫైనల్లో కొరియా స్టార్ సంగ్ జి హ్యూన్ చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, కామన్వెల్త్ స్వర్ణ పతక […]

వుహాన్: చైనాలోని వుహాన్‌లో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంది శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ మలేసియా స్టార్ చాంగ్ వీ లి చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సింధు క్వార్టర్ ఫైనల్లో కొరియా స్టార్ సంగ్ జి హ్యూన్ చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్ ఫైనల్ పోరులో జయకేతనం ఎగుర వేసింది. కొరియా క్రీడాకారిణి లీ జంగ్ మితో జరిగిన క్వార్టర్స్ సమరంలో సైనా 2115, 2113తో విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సైనా ఏదశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చూడచక్కని షాట్లతో చెలరేగిన సైనా వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు చేరుకుంది. సింధు క్వార్టర్ పోరులో 1921, 1021 తేడాతో హ్యూన్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 1221, 1521 తేడాతో చాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏకపక్షంగా సాగిన పోరులో చాంగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఏదశలోనూ శ్రీకాంత్ ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశాడు.

Comments

comments

Related Stories: