2018నాటికి రైతులకు 24గంటలు కరెంటు ఇస్తాం

* గ్రామాలలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తిర్చిదిద్దాలి
* ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణనానికి కృషి
* నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

Krishna-rao1

కొల్లాపూర్: రాష్ట్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాలలో ముందుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పట్టణంలోని కెఎల్‌ఐ అథితి గృహం లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలికంగా మిగిలి ఉన్నసమస్యలు ఒక్కోక్కటి తిరిపోతున్నాయని ఆయన అన్నారు. మోబైల్ , ఆధార్ , బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు కోనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. గ్రామాలలో మిగిలి ఉన్న సిసి రోడ్లకు నిధు లు మంజూరు చేసి పూర్తి చేస్తామని ఆయన వెల్లడిం చారు.

గ్రామాలలో నిరక్షరాస్యులను నిర్ములనకు అందరు కృషి చేయాలని ఆయన కోరారు. 2018 సం॥ వరకు రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ఆయన వివరించారు.మిషన్ భగిరథ ద్వారా 2017వరకు ఇంటింటికి త్రాగునీరు అంది స్తామని మంత్రి వెల్లడించారు. మిషన్ కాకతీయలో మిగిలిన చెరువుల పనులు త్వరలో చెపట్టి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.గ్రామాలలో ప్రతి ఇంటికి మరుగుదోడ్డి నిర్మించుకోని స్వఛ్చగ్రామాల నిర్మాణనికి అందరు కలిసి రావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిపి చిన్న నిరంజన్‌రావు, జడ్‌పిటిసి హన్ముంత్ నాయక్, కొల్లాపూర్ సింగిల్‌విండో చైర్మేన్ జూపల్లి రఘుపతిరావు, మార్కెటు యార్డు చైర్మెన్ రామచంద్రారెడ్డి, కొల్లాపూర్ తాలుక ప్రత్యేక అధికారి కృష్ణయ్య, టిఆర్‌ఎస్ నాయకులు బోరెల్లి మహేష్, రెడ్డి సత్యం, బాలస్వామి , అన్వర్, అక్బర్‌అలీ, నహీమ్, మహబుబ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments