20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

హసన్‌పర్తి: మండలంలోని నాగారం శివారులో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం హసన్‌పర్తి పోలీసులకు అందింది. దీంతో హసన్‌పర్తి సిఐ పుల్యాల కిషన్ తన సిబ్బందితో బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు జయగిరికి చెందిన దండుగుల శ్రీను, బాలరాజు, హసన్‌పర్తికి చెందిన వేల్పుల కిరణ్, ఎల్లాపూర్‌కు చెందిన రమేష్, లక్ష్మయ్య లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 40బస్తాలు, సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ కిషన్ మాట్లాడుతూ రేషన్ […]

హసన్‌పర్తి: మండలంలోని నాగారం శివారులో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం హసన్‌పర్తి పోలీసులకు అందింది. దీంతో హసన్‌పర్తి సిఐ పుల్యాల కిషన్ తన సిబ్బందితో బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు జయగిరికి చెందిన దండుగుల శ్రీను, బాలరాజు, హసన్‌పర్తికి చెందిన వేల్పుల కిరణ్, ఎల్లాపూర్‌కు చెందిన రమేష్, లక్ష్మయ్య లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 40బస్తాలు, సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ కిషన్ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నాగారాం క్రాస్ రోడ్డు వద్ద మంగళశారం తనిఖీలు నిర్వహించమని సిఐ తెలిపారు. ఈ  తనిఖీలలో భాగంగా ఆటోలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యం దొరికాయన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్సై సుధాకర్, కానిస్టేబుల్స్ నాగేశ్వర్‌రావు, రాజసమ్మయ్య, శ్రీనివాస్, రైటర్ నర్సయ్య పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: