విశాఖలో మరో విషాదం.. గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి,

2 workers died after gas leakage in Visakhapatnam

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో వరుస గ్యాస్ లీకేజ్ ఘటనలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖలో ఎల్‌జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం పరవాడలోని ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో బెంజి మిడజోల్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే గాజువాకలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతులను షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర కెమిస్ట్ గౌరీశంకర్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గ్యాస్ లీకేజీ ఓ విభాగానికే పరిమితమని అధికారులు చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

2 workers died after gas leakage in Visakhapatnam

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విశాఖలో మరో విషాదం.. గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి, appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.