లాహోర్ ఎయిర్‌పోర్టులో కాల్పులు : ఇద్దరు మృతి

పాకిస్థాన్ : లాహోర్ లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో   ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మక్కా నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో దుండగుడు  కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్పుల ఘటనలో ఉగ్రకోణం లేదని, వ్యక్తిగత కక్షల కారణంగానే సదరు నిందితుడు […] The post లాహోర్ ఎయిర్‌పోర్టులో కాల్పులు : ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాకిస్థాన్ : లాహోర్ లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో   ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మక్కా నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో దుండగుడు  కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్పుల ఘటనలో ఉగ్రకోణం లేదని, వ్యక్తిగత కక్షల కారణంగానే సదరు నిందితుడు కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఎయిర్ పోర్టుకు వస్తున్నవాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్ పోర్టు వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

2 Persons Shot Dead in Lahore Airport At Pak

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లాహోర్ ఎయిర్‌పోర్టులో కాల్పులు : ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: