బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ అరెస్టు

 2 Naxals wanted for murdering cops held in Bijapur

 

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి ఇద్దరు నక్సల్స్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. భైరంగఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని తిందోడి గ్రామంలో మహేష్ యాదవ్(32)ను, బీజాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిల్నర్ గ్రామంలో మంకు మొడియం(32)ను అదుపులోకి తీసుకున్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ ఇద్దరు నక్సలైట్లు అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా బస్తర్, కంకర్, కొండగావ్, నారాయణ్‌పూర్, దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి.

2 Naxals wanted for murdering cops held in Bijapur

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.