టిఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ ధినోత్సవ సంబురాలు….

  శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 18వ ఆవిర్భావ ధినోత్సవం సందర్బంగా చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం రోడ్‌లో తెరాస నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెరాస పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు కెసిఆర్ 2001 ఏఫ్రిల్ 27వ తేదిన హైదరాబాద్ నడిబొడ్డున జలదృశ్యంలో పిడికెడు మందితో గులాబీ పార్టీని […] The post టిఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ ధినోత్సవ సంబురాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 18వ ఆవిర్భావ ధినోత్సవం సందర్బంగా చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం రోడ్‌లో తెరాస నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెరాస పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు కెసిఆర్ 2001 ఏఫ్రిల్ 27వ తేదిన హైదరాబాద్ నడిబొడ్డున జలదృశ్యంలో పిడికెడు మందితో గులాబీ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నేడు బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ నేటికి 18 ఏళ్ళు పూర్తవడం సంతోషకరమన్నారు. అందిరకి టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల్లో రగిల్చి అరవై ఏళ్ళ కలను సాకారం చేసిన ఉద్యమ సారథిగా సిఎం కెసిఆర్ యావత్ తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని రెండు సార్లు అధికారంలోకి వచ్చి భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టకు కృషి చేయాలన్నారు. తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కెటిఆర్ అడుగుజాడల్లో పయనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, నాయకులు బొబ్బ విజయ్‌రెడ్డి, ఉట్ల కృష్ణ, సంజీవరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నార్నె శ్రీనివాస్, మిద్దెల మల్లారెడ్డి, ఉరిటి వెంకట్రావు, ప్రసాద్, సంజీవరెడ్డి, అక్బర్‌ఖాన్, జగదీష్, పోచయ్య, సంపత్, శ్రీకాంత్‌రెడ్డి, గోపి, చందర్‌రావు, జ్యోతి, మాణిక్‌యరావు, రామ,చంద్రరెడ్డి, గోవిందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

18th Formation Day of TRS Party

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ ధినోత్సవ సంబురాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: