పంజా

1850 cases report positive in a day in Telangana

 

ఒకే రోజు 1850 మందికి కరోనా
జిహెచ్‌ఎంసిలో 1572, జిల్లాల్లో 278
విప్ సునీత భర్త మహేందర్‌రెడ్డికీ వైరస్
ప్రైవేటు డాక్టర్ సహా 5గురు మృతి

ఆ బస్సులో కరోనా…

గురువారం మధ్యాహ్నం 3.30కి హైదరాబాద్ ఎంజిబిఎస్ నుంచి బయలు దేరి ఆదిలాబాద్‌కు రాత్రి 10.30కి చేరుకున్న సూపర్ లగ్జరీ బస్ టిఎస్ 08జెడ్ 0229లో ప్రయాణించిన వారిలో ముగ్గురికి కరోనా సోకింది. ఆ బస్సులో ప్రయాణించిన వారు రిమ్స్‌లో టెస్టులు చేపించుకోవాలని ఆ జిల్లా డిఎంహెచ్‌ఓ సూచన.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఒకే రోజు 1850 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1572, జిల్లాల్లో 278 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అయితే రోజురోజుకి కేసులు అంతకంతకి పెరుగుతుండటంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. మరోవైపు వైరస్ దాడిలో మరో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. కానీ వీరు ఎక్కడి వారేనది అధికారులు తెలుపలేదు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 1572, రంగారెడ్డి 92, మేడ్చల్ 53, సంగారెడ్డి 8, కరీంనగర్ 18, మహబూబ్‌నగర్ 5, గద్వాల 2, రాజన్న సిరిసిల్లా 3, ఖమ్మం 7, నల్గొండ 10, సిద్దిపేట్ 5, వరంగల్ రూరల్ 6, జగిత్యాల 5, నిర్మల్ 1, నిజామాబాద్ 17, వరంగల్ అర్బన్ 31, భద్రాది కొత్తగూడెం 3, వికారాబాద్ 3, భూవనగిరి 1, భూపాలపల్లి 4, జనగాం 3, మెదక్‌లో ఒకరు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 22,312కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 11537కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 10487 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 288కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

ప్రభుత్వ విప్ సునీత భర్తకు పాజిటివ్
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గొంగిడి సునీతకి కరోనా సోకగా, తాజాగా ఆయన భర్తకు కూడా నిర్ధారణ అయింది. వీరితో పాటు వారి డ్రైవర్లకు కూడా కోవిడ్ తేలింది. దీంతో వీరంతా హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఓ ప్రైవేట్ వైద్యుడి మృతి
సికింద్రాబాద్ పరిధది సీతాఫల్ మండీ పరిధిలో ఓ నర్సింగ్ హోమ్ నిర్వహించే వైద్యుడు కరోనాను మృతి చెందినట్లు సమాచారం. ఈయన గత కొన్ని రోజులుగా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ సేవలు చేసేవారని స్థానికులు తెలిపారు.

ఎపిలో 765 కరోనా కేసులు
ఎపిలో గడిచిన 24 గంటల్లో 24,962 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 765పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి 32 కేసులు, విదేశాల నుంచి వచ్చిన వారివి ఆరు కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 17,699కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 311 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8008కి చేరింది. తాజాగా 12 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 218కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9,96,573 టెస్టులు చేశామని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9473 యాక్టివ్ కేసులున్నాయన్నారు.

1850 cases report positive in a day in Telangana

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పంజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.