చీట్ ఫండ్ల చిద్విలాసాలు

  చిన్న బతుకులను చిదిమేస్తున్న చిట్టీల మోసాలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంచనా ప్రకారం, 31 అక్టోబర్ 2014 నాటికి, సుమారు 5000 లిస్టెడ్ చిట్ ఫండ్ కంపెనీలు దేశంలో పని చేస్తున్నాయి. అయితే అధికారికంగా నమోదు కాని చిట్ ఫండ్ సంస్థలు చాలా ఉన్నాయి. అసలు ఈ సంస్థలతో సంబంధం లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో వీధికి ఒక్కరు ఇద్దరు చొప్పున చిట్టీ వ్యాపారాలు నడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అనామక సంస్థలు, వ్యక్తులు డిపాజిట్ […] The post చీట్ ఫండ్ల చిద్విలాసాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిన్న బతుకులను చిదిమేస్తున్న చిట్టీల మోసాలు

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంచనా ప్రకారం, 31 అక్టోబర్ 2014 నాటికి, సుమారు 5000 లిస్టెడ్ చిట్ ఫండ్ కంపెనీలు
దేశంలో పని చేస్తున్నాయి. అయితే అధికారికంగా నమోదు కాని చిట్ ఫండ్ సంస్థలు చాలా ఉన్నాయి. అసలు ఈ సంస్థలతో
సంబంధం లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో వీధికి ఒక్కరు ఇద్దరు చొప్పున చిట్టీ వ్యాపారాలు నడుపుతున్నవారు ఎంతో మంది
ఉన్నారు. అనామక సంస్థలు, వ్యక్తులు డిపాజిట్ దారుల నుండి కొల్లగొడుతున్న డబ్బులు కనీసం ప్రభుత్వ రికార్డ్‌లకు కూడా
అందడం లేదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఏప్రిల్ 2016 నాటి అంచనా ప్రకారం చిట్ ఫండ్ సంస్థలు ప్రజల
నుండి సుమారు 80,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. కోల్పోయిన ప్రజల డబ్బు ఇంతకంటే అధికంగా ఉంటుందనేది
నిపుణుల అంచనా. దేశంలో పెద్ద సంస్థలలో ఒకటయిన పెరల్ ఇండియా ప్రయివేట్ లిమిటేడ్ చిట్ ఫండ్ సంస్థ చాలా రాష్ట్రాలలో
సుమారు 5.5 కోట్ల మంది డిపాజిట్ దారులను మోసగించి, 51,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. మన తెలుగు రాష్ట్రాలలోలక్షలాది ప్రజలను మోసం చేసిన సంస్థగా సుపరిచితమైన అగ్రిగోల్డ్ 23 లక్షల మంది డిపాజిట్ దారులను, శారదా చిట్ ఫండ్ సంస్థ 17 లక్షల మంది డిపాజిట్ దారులను మోసగించాయి.

నాలుగు రోజుల క్రితం, కర్నూల్ జిల్లాలోని ఒక గ్రామంలో, కుటుంబాల సంవత్సరపు సగటు ఖర్చులు – ఆదాయల గురించి గ్రామ మహిళలతో చర్చిస్తున్నప్పుడు, 60 ఏండ్ల మహిళ ఒకరు, అతి జాగ్రత్తగా దాచిన రసీదులను చేతి నిండా పట్టుకొని వచ్చింది. కూలి కష్టం చేసి, కడుపు కట్టుకొని ప్రతి నెల పొదుపు చేసుకొన్న డబ్బును ఇప్పించమంటూ, తన చేతిలోని రసీదులను నా చేతిలో ఉంచింది. ఊరి వాళ్లు ఎవరో, పాన్ కార్డ్ తెచ్చుకుంటే, కట్టిన పొదుపు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తారంటె, పాన్ కార్డ్ కోసం అప్ప్లై చేసింది. పాన్ కార్డ్ రిసిప్ట్ ను కూడా తన వద్ద ఉన్న పొదుపు రసీదులతో పాటు జాగ్రత్తగా దాచుకొని తెచ్చింది. పెరల్స్ సంస్థలో పొదుపు చేస్తే బాగుంటుందని, తన ఊరి అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి, ప్రతి నెల 500 రూపాయల ప్రకారం, 2 సంవత్సరాలకు పైగా తాను పెరల్స్ సంస్థలో పొదుపు చేసుకుంటూ వచ్చానని ఆ పేద మహిళ చెప్పింది. ఇప్పుడు ఆ సంస్థను మూసివేశారంటున్నారు, తనకు వడ్డి అవసరం లేదని, కనీసం తాను చెల్లించిన పొదుపు డబ్బులు అయినా తనకు ఇప్పిస్తే చాలని అవేదనతో చెప్పింది.

ఆ పేద మహిళ తెచ్చిన రసీదులు అన్ని చూశాను. ఇలాంటి చిట్ ఫండ్ సంస్థల్లో ఎందుకు పొదుపు చేశావు? ఎంత మంది ఇలాగా పొదుపు చేశారు? అని అడిగాను. తమ గ్రామంలోనే, సుమారు రెండు వందల మందికి పైగా పెరల్స్ చిట్ ఫండ్ లో పొదుపు చేశామని ఆ మహిళతో పాటు మిగిలిన మహిళలు చెప్పారు. మీ డబ్బులు తిరిగి తెచ్చుకోవడం కోసం ఏమి చేశారు? అందరు కలిసి పోయి ప్రభుత్వ అధికారులను కలిశారా? కలెక్టర్ ను కలిశారా ?అని అడిగాను. మాకు అవన్నీ తెలియవు. మా ఊరి వారు, అందరం కలిసి పోదామంటే రారు అని చెప్పింది. బహుశా అధికారులను కలిసినా ప్రయోజనం ఉండదేమో అన్న నిరాశ, ఏ రోజుకారోజు పని చేసుకుంటే తప్ప బ్రతుకులు గడవని పరిస్థితుల్లో, ఎంత కాలం అని అధికారుల చుట్టు తిరుగుతాము అన్న ప్రశ్నలతో వారు ఆ ప్రయత్నాలే చేయలేక పోయారేమో? చిట్ ఫండ్ బాధితులను అందరిని కదిలించి సమీకరించే సంస్థలు లేకపోవడం లేదా అలా సమీకరించే పనికి, ఉన్న సంస్థలు సంసిద్ధంగా ఉందకపోవడం ఫలితంగా, ఏదో ఒక రోజు తమ డబ్బులు తమకు వస్తాయేమో అన్న చిరు ఆశల్ని కళ్ల నిండా నింపుకొని ఎదురుచూడటం తప్పా ఇతర పరిష్కారాలు అందుబాటులో లేని నిస్సహాయ స్థితి వారిది.

తమ గ్రామంలో నివసించే ఇద్దరు నిరుపేద తల్లి కూతుర్లు, స్కూల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంతో కడుపులు నింపుకొని, ప్రతి రూపాయి కూడ బెట్టి పొదుపు చేశారని చెప్పారు. ఒక్కొక్కరిది ఒక విషాదం. కొత్త ఇల్లు కట్టుకొని తమ జీవితకాల కోరికను సాకారం చేసుకోవాలని కొందరు, బిడ్డల పెళ్లిళ్ల కోసం కొందరు, భవిష్యత్ లో తమకు వైద్య పరమైన ఖర్చులకు ఆదుకుంటాయన్న ఆశతో కొందరు, పిల్లల పై చదువుల కోసం కొందరు, కనీసం కొంత స్థలం అయినా కొనాలన్న కోరికలతో కొందరు, పిల్లలకు ఉపాధి కల్పించడానికి ఉపయోగపడతాయని కొందరు, తమ పాత ఇళ్లను పునర్ నిర్మించుకోవాలని కొందరు, పెద్ద మొత్తంలో కొంత డబ్బు చేతిలోకి వస్తే తాము ఏవైన చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితాలను కొంచెం మెరుగు పరుచుకోవాలన్న ఆకాంక్షలతో కొందరు… ఇలా లక్షలాది మంది ప్రజలు, తమ కళ్లల్లో కోటి ఆశల వెలుగులు నింపుకొని పొదుపులు చేశారు.

వారి పొదుపులు తమకు వచ్చే ఆదాయాలు ఎక్కువయి చేసినవి కాదు, అవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకొని, ఇప్పుడు పడ్డ కష్టానికి భవిష్యత్ లో అయినా సంతోషం దొరుకుంతుందన్న ఆకాంక్షలతో, జీవితకాల కలల్ని పండించుకుంటామన్న ఆశతో, అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఆలోచనతో పొదుపులు చేశారు. కొంత మంది సంవత్సరాల కాలం నుండి చిన్న చిన్న మొత్తాల రూపంలో తమ ఇళ్లల్లో దాచుకున్న డబ్బులను, మరి కొందరు చిన్న సంస్థలలో పని చేయగా వచ్చిన పీ ఎఫ్ డబ్బులను, రైతులు మరుసటి పంటకు దాచుకున్న డబ్బులను, చేస్తున్న పనుల్లో భర్త దుర్మరణం పాలయితే తమను ఆదుకోవడానికి వచ్చిన డబ్బులను, చివరికి బ్యాంక్ లోన్స్ సైతం తీసుకొని తెచ్చుకున్న డబ్బులను డిపాజిట్ల రూపంలో చిట్ ఫండ్ సంస్థలలో ధారపోశారు. వీరిలో చాలా మంది తమ జీవిత కాలంలో మరో సారి అంత డబ్బు పొదుపు చేయడానికి శక్తి కాని, వనరులు కాని లేని వాళ్లు. అసలు మరో పొదుపు చేయడం కాదు. ప్రస్తుతం జరిగిన నష్టాన్నే తట్టుకోవడానికే శక్తి లేక, నిస్సహాయులై విలవిలలాడుతున్నావాళ్లు.

పొదుపులు చేయడానికి పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన పరిష్కారాలుగా చిట్ ఫండ్స్ కంపెనీలు ఉండాటానికి కారణాలు ఉన్నాయి. చిట్ ఫండ్స్ తో పోలిస్తే, బ్యాకుల్లో డబ్బులు సురక్షితంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ బ్యాంకులు వారికి అందుబాటులో లేవు. అనుకూలంగా లేవు. ఒక వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), జూన్ 2016 నాటికి, దేశంలో 1,30,000 బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయని, ప్రపంచంలోనే అత్యధిక బ్యాంక్ బ్రాంచీలు ఉన్న దేశం మనది అని చెపుతున్నప్పటికి, గామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకులు తగినంత అందుబాటులో లేవు అన్నది వాస్తవం. ఇందుకు ప్రత్యామ్నయంగా ఏర్పటైన బ్యాంక్ సర్వీస్ సెంటర్లు సరిగా పనిచేయడం లేదని, ఆ సెంటర్లు మూత పడుతున్నాయని నివేదికలు చెపుతున్నాయి. గ్రామీణ ప్రజలు బ్యాంకులకు వచ్చి పొదుపు చేయాలంటే, తమ ఒక రోజు పని దినాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. స్వంత ఊరిలో బ్యాంక్ ఉన్నా ఒక్కో సారి ఇదే పరిస్థితి ఉంటుంది. పొదుపులు చేసి, మధ్యాహ్నం పనికి పోవడానికి, షిఫ్ట్ పద్దతిలో పనిచే వ్యవస్థ రోజువారి కూలి పనుల్లో ఉండదు.

బ్యాంకులో పొదుపులపై ఇచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. కోటీశ్వరులకు ధారాళంగా అప్పులు అందించే బ్యాంకులు, అవసరాలకు అప్పులు అడిగే పేద, మధ్య తరగతి ప్రజల విషయం వచ్చేసరికి, వారికి అప్పులిచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతుంటాయి. ఇన్ని బాధలు పడలేక, తమ ఊరి వారే, తమ ఇండ్ల వద్దకు, తమకు అనుకూలమైన వేళలలో వచ్చి పొదుపు తీసుకు పొతాము. పొదుపులపై అధిక వడ్డి ఇస్తాము. 6500 రూపాయలు డిపాజిట్ చేస్తే, 21 నెలలలో 21,000 ల రూపాయలు ఇస్తామని శారదా చిట్ ఫండ్ కంపెనీ చెప్పింది. మీకు కావల్సినప్పుడు మీ వద్దకు వచ్చి అప్పు ఇస్తాము. బ్యాంకులు అడిగినట్లు మిగిలిన బ్యాంకులతో అప్పు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు అన్న ధృవ పత్రాలను మేము అడుగము అంటున్నారు. ఈ అనుకూలతలతో, గ్రామీణ ప్రాంతాలలోని, పట్టణ ప్రాంతాలలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు పొదుపులు, డిపాజిట్లు చేయాడానికి చిట్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. ఉన్న పరిస్థితులలో, చిట్ ఫండ్స్ వారికి అందుబాటులో ఉన్న పరిష్కారంగా చూస్తున్నారు.

చిట్ ఫండ్స్ సంస్థలు మోసం చేస్తున్నాయి కదా అంటే, అన్ని సంస్థలు అలాచేయవు అన్న అమాయకపు నమ్మకంతో, ఆకర్షణీయమైన ఆఫర్లకు ప్రభావితులై, తమ ఊరి పిల్లల మాట కాదనలేక, చిట్ ఫండ్ సంస్థల ప్రచారం, స్థానిక ప్రభుత్వ అధికారులు, పాలక, ప్రతి పక్ష పార్టీల నాయకుల అండదండలు ఉన్న సంస్థలు ఎక్కడికి వెళ్లవు అన్న విశ్వాసంతో, అవసరాలకు ఆదుకొంటాయని చిట్ ఫండ్స్ సంస్థల విషకౌగిళ్లను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగాన్ని అవకాశంగా మార్చుకొని, సమీకరించిన డిపాజిట్ సొమ్ములో 30% కమీషన్ ఇస్తామంటు, డిపాజిట్ల పై రకరకా ఆఫర్లు చూపి, ఆయా గ్రామాలలోని / పట్టణాలలో పేద వాడలోని నిరుద్యోగులైన యువతీ యువకుల్ని ఏజెంట్లుగా చేర్చుకొని తమ పని సులభంగా చేసుకుపోతున్నారు చిట్ ఫండ్ కంపెనీల అధినేతలు. ఈ చిట్ ఫండ్ కంపెనీలు మోసం చేసి నప్పుడు, ఆస్థులు అమ్ముకోవడమో, ఆత్మహత్యలూ చేసుకోవడమో, ఉన్న ఊరు వదిలి వెళ్లిపోవడమో, అవమానాలకు బలికావడమో, జీవితకాలం అపరాధ భావనతో బ్రతుకడమో ఏజెంట్లు చేస్తుంటారు. ఎక్కువ మంది ఏజెంట్లది విషాదకరమైన పరిస్థితి.

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంచనా ప్రకారం, 31 అక్టోబర్ 2014 నాటికి, సుమారు 5000 లిస్టెడ్ చిట్ ఫండ్ కంపెనీలు దేశంలో పనిచేస్తున్నాయి. అయితే అధికారికంగా నమోదు కాని చిట్ ఫండ్ సంస్థలు చాలా ఉన్నాయి. అసలు ఈ సంస్థలతో సంబంధం లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో వీధికి ఒక్కరు ఇద్దరు చొప్పున చిట్టి వ్యాపారాలు నడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అనామక సంస్థలు, వ్యక్తులు డిపాజిట్ దారుల నుండి కొల్లగొడుతున్న డబ్బులు కనీసం ప్రభుత్వ రికార్డ్ లకు కూడా అందడం లేవు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎప్రిల్ 2016 నాటి అంచనా ప్రకారం, చిట్ ఫండ్ సంస్థలు ప్రజల నుండి సుమారు 80,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. కోల్పోయిన ప్రజల డబ్బు ఇంతకంటే అధికంగా ఉంటుందనేది నిపుణుల అంచనా. దేశంలో పెద్ద సంస్థలలో ఒకటయిన పెరల్ ఇండియా ప్రయివేట్ లిమిటేడ్ చిట్ ఫండ్ సంస్థ చాలా రాష్ట్రాలలో సుమారు 5.5 కోట్ల మంది డిపాజిట్ దారులను మోసగించి, 51,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

మన తెలుగు రాష్ట్రాలలో లక్షలాది ప్రజలను మోసం చేసిన సంస్థగా సుపరిచతమైన అగ్రి గోల్ 23 లక్షల మంది డిపాజిట్ దారులను, శారదా చిట్ ఫండ్ సంస్థ 17 లక్షల మంది డిపాజిట్ దారులను మోసగించాయి.చిట్ ఫండ్ సంస్థలు, తమ లాభంలో 10% రిజర్వ్ నిధికి జమచేయాలని, మొత్తం డిపాజిట్ లో, సగం డిపాజిట్ లకు తమ స్వంత ఆస్థులను మరియు మిగతా సగం డిపాజిట్ లకు బ్యాంకు స్యూరిటిని ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ, ఒక్కో చిట్ ఫండ్ సంస్థ లక్షల సంఖ్యలో డిపాజిట్ దారులను చేయడం, వేల కోట్ల రుపాయల ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవడం, ఆ డబ్బును విలాసాలకు, సరదాలకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం, నానా రకాల భినామి పేర్లతో స్వంత ఆస్థులు పెంచుకోవడానికి ఖర్చు పెట్టడం, ఆపై చిట్ ఫండ్ సంస్థను మూసి, డిపాజిట్ దారులను, ఏజెంట్లను రోడ్ల మీదిపైకి తోసేయడం ఎలా చేయగలుగుతున్నారు అన్న అనుమానం అక్కరలేదు.

ఈ చిట్ ఫండ్స్ సంస్థల గాడ్ ఫాదర్స్ ఎంత శక్తిమంతులో అర్థం చేసుకుంటే, అలాంటి అనుమానాలు ఉండవు. ఉదాహరణకు, ఏడు రాష్ట్రాలకు విస్తరించిన శారద చిట్ ఫండ్ సంస్థ కుంభకోణంలో CBI పేర్కొన్న, అరెస్ట్ చేసిన నిందితులలో, ఆ రాష్ట్రాలలోని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP) సభ్యులు, ముఖ్య మంత్రి కుమారులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి మొదలుకొని, బిజూ జనతా దళ్ దాక, కాంగ్రెస్ పార్టీ దాక, అన్ని పాలక పార్టీలకు సంబంధించిన వారు క్రియాశీలక భాగస్వాములుగా/ మద్దతుదారులుగా ఉన్నారు. రాష్ట్ర ఉన్న స్థాయి పోలీసు అధికారులు డిజిపి దాక భాగస్వాములుగా ఉన్నారు. శారద స్కాం లో తనను అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో మాజీ డిజిపి ఆత్మ హత్య చేసుకున్నారు. శారద స్కాంలో ప్రధాన నిందితులలో ఒకరైన ముఖుల్ రాయ్ ని తమ పార్టీలో చేర్చుకొని BJP ఈ జాబితాలో తరువాత చేరింది. అంటే అన్ని పార్టీల సహకారం శారద సంస్థకు అందింది.

శారద చిట్ ఫండ్ సంస్థ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పెయింటింగ్‌ను, ఒక కోటి 20 లక్షలకు కొనింది. కొల్ కత్తా లోని పోలీసులకు వాహనాలను ఉచితంగా అందించింది. ఈ కార్యక్రమాన్ని స్వయాన ముఖ్య మంత్రే నిర్వహించారు. శారద సంస్థ 5 భాషల్లో ప్రచురించే 8 పత్రికలను, రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాకు చేరవేయాలని, ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. శారద సంస్థకు సుమారు 140 కంపెనీలు ఉన్నాయి. శారద సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని CBI ముందుగానే, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా లాభం లేకుండా పోయిం ది. ఇంత మద్దతు కలిగి ఉండటం వల్లనే, చిట్ ఫండ్ సంస్థలు కోట్ల మంది ప్రజలను ముంచి, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకోగలుగుతున్నారు. ఇంకో బాధాకరమైన విషయం, దేశాన్ని కుదిపి వేసిన శారద స్కాంలో ప్రధాన నిందితుడు ఆ సంస్థకు చైర్ మెన్ అయిన సుదీప్త సేన్ అలియాస్ శంకారదిత్య సేన్ మాజీ నక్సలైట్ కావడం.

ఆర్థిక నేరాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలక పార్టీల నాయకులు ఉండటం, పోలీసు అధికారుల, ఇతర ఉన్నతాధికారుల ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు, పెద్ద స్థాయి న్యాయవాదులు వీరి తరఫునే వాదించే పరిస్థితి ఉండటం వల్ల, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలకు ప్రారంభంలోనే అడ్డుకట్టవేసే పరిస్థితి లేకుండా పోయింది. చిట్ ఫండ్ సంస్థల చేతిలో మోసపోయిన డిపాజిట్ దారులు సంఘటితం కాలేక పోతున్నారు. తమకు న్యాయం జరుగడం కోసం దీర్ఘకాలం పాటు ఉద్యమించలేక పోతున్నారు. ఆశ్చర్యకరమో, బాధాకరమో తెలియదు కాని, పేద, దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాలను శాశ్వతంగా వేదనామయం చేసే చిట్ ఫండ్ సంస్థల మోసాల పట్ల, కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ సంస్థలకు తగిన పట్టింపు లేకపోవడం.

చిట్ ఫండ్ కంపెనీల బాధితులను సమీకరించడంలో, వారికి న్యాయం జరిగేలా ఉద్యమాలు నిర్వహించడం పట్ల, బాధితులకు న్యాయ పరమైన సహకారాన్ని దీర్ఘకాలం అందించడం పట్ల కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. బహుశా ఆర్థిక నేరాలలో నిందితులకు శిక్షలు పడటం, బాధితులకు న్యాయం జరగడం దీర్ఘ కాలం పడుతుంది అనుకుంటున్నారేమో? ఫలితంగా బాధితులు కోర్టుల క్రియాశీలతను నమ్ముకొని, ఏమో అదృష్టం ఉంటే, ఎప్పుడో ఒకసారి తమ డబ్బులు వస్తా యి అన్న ఆశ ఒకవైపు, కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని తలుచుకొని కుమిలిపోతూ బ్రతుకులీడుస్తున్నారు.

17 lakh depositors fraud in Saradha chit fund scam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చీట్ ఫండ్ల చిద్విలాసాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.