రామాపురం కన్నీటి సంద్రం

  మృతదేహాలను తీసుకురావడంతో దుఃఖసాగరమైన గ్రామం కడచూపు కోసం తరలివచ్చిన బంధువుల ఆర్తనాదాలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ /గద్వాల: గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామం కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువుల కుటుంబసభ్యులు, స్నేహితుల ఆర్తనాదాలతో అట్టుడికింది. శనివారం రాత్రి కర్నూల్ జిల్లా వెల్దుర్తి దగ్గర 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన 15 మంది మృతి […] The post రామాపురం కన్నీటి సంద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మృతదేహాలను తీసుకురావడంతో దుఃఖసాగరమైన గ్రామం
కడచూపు కోసం తరలివచ్చిన బంధువుల ఆర్తనాదాలు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ /గద్వాల: గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామం కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువుల కుటుంబసభ్యులు, స్నేహితుల ఆర్తనాదాలతో అట్టుడికింది. శనివారం రాత్రి కర్నూల్ జిల్లా వెల్దుర్తి దగ్గర 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం పోస్టుమార్టం ముగించి ప్రత్యేక శవపేటికలో వడ్డేపల్లి మండలం రామాపురంకు తరలించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు మృతదేహాలను గ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా అటు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇటు రామాపురం గ్రామం కన్నీటి రోదనలతో అలమటించింది. గ్రామంలోకి మృతులందరూ ఒకే కుటుంబ సభ్యులు కావడం చిన్నాన్న, పెద్దనాన్న బంధువులు కావడంతో గ్రామమంతా ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. మృతులను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు తరలి వచ్చారు.

గ్రామంలో ఒకేసారి 15కు 15 మంది మృతులు ఉండడంతో మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చారు. అంత్యక్రియలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించింది. పెళ్లి చూపులకు వెళ్లి సంతోషంగా వస్తారనుకున్న తమ బంధువులు శవాలై ఇంటికి రావడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఎటు చూసినా ఎవరిని కదిపినా కన్నీళ్లే వచ్చాయి. మధ్యాహ్నం మృతదేహాలను గ్రామాలకు తరలించి సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా మానవపాడు పర్యటనలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామి ఇచ్చారు. అంతకు ముందు బాధిత బంధువులు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్యే సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డికె అరుణ కూడా రామాపురం వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సంఘటన అత్యంత విషాదకరమని ఆమె వ్యాఖ్యానించారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : కలెక్టర్
కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో అసువులు బాసిన రామాపురం బాధితులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల పొలం, కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు ఉచితంగా విద్య, ఆపద్భంధు పథకం ద్వారా సహాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తక్షణ సహాయంగా రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించినట్లు చెప్పారు. చనిపోయిన వారిలో ఆరుగురు రైతులు రైతుబీమా కల్గి ఉన్నారని వారికి రూ.5లక్షల చొప్పున బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. వోల్వో ట్రావెల్స్ వారితో మాట్లాడి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చేస్తామని హామి ఇచ్చారు. డిఆర్‌డివో, ఐకేపి ద్వారా ఏమైనా సహాయం పొందడానికి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

15 killed in horrific accident in Andhra after bus collides

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రామాపురం కన్నీటి సంద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: