బోట్లు మునిగి 15 మంది మత్స్యకారులు మృతి

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక, పోరబందర్ తీర ప్రాంతాలలో బోట్లు మునిగిపోవడంతో 15 మంది మత్స్యకారులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ద్వారక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 24 మంది మత్స్యకారులు ఆరు బోట్ల సహాయంతో రుపెన్ పోర్టు తీరంలో చేపలను వేటాడి తిరిగి వస్తుండగా బోట్లు నీళ్లలో మునిగిపోయాయి. ఏడుగురు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈ ఘటనలో 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో ఇద్దరు […] The post బోట్లు మునిగి 15 మంది మత్స్యకారులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అహ్మదాబాద్: గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక, పోరబందర్ తీర ప్రాంతాలలో బోట్లు మునిగిపోవడంతో 15 మంది మత్స్యకారులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ద్వారక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 24 మంది మత్స్యకారులు ఆరు బోట్ల సహాయంతో రుపెన్ పోర్టు తీరంలో చేపలను వేటాడి తిరిగి వస్తుండగా బోట్లు నీళ్లలో మునిగిపోయాయి. ఏడుగురు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈ ఘటనలో 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో ఇద్దరు కోసం తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలలో చిక్కుకొని ఇప్పటివరకు 19 మంది చనిపోయారు.  జూన్ 15 నుంచి అగస్టు 30 వరకు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని తీర రక్షక అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

 

15 Fishermen Dead after Boats Capsize off in Gujarat

The post బోట్లు మునిగి 15 మంది మత్స్యకారులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: