15కి చేరిన భారత్ పసిడి పతకాల సంఖ్య

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం ఇండియా ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. 49 కిలోల లైట్ ఫ్లై బాక్సింగ్‌లో అమిత్ పంగల్ పసిడి పతకం సాధించాడు. అలాగే బ్రిడ్జి టీం ఈవెంట్లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. బ్రిడ్జిలో ప్రణవ్ బర్ధన్, సర్కార్ శివనాథ్ పసిడి కొల్లగొట్టారు. కాగా, భారత్‌కు గోల్డ్ సాధించి పెట్టిన ప్రణవ్ బర్ధన్ వయస్సు 60 ఏళ్లు కావడం […]

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం ఇండియా ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. 49 కిలోల లైట్ ఫ్లై బాక్సింగ్‌లో అమిత్ పంగల్ పసిడి పతకం సాధించాడు. అలాగే బ్రిడ్జి టీం ఈవెంట్లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. బ్రిడ్జిలో ప్రణవ్ బర్ధన్, సర్కార్ శివనాథ్ పసిడి కొల్లగొట్టారు. కాగా, భారత్‌కు గోల్డ్ సాధించి పెట్టిన ప్రణవ్ బర్ధన్ వయస్సు 60 ఏళ్లు కావడం విశేషం. మరో ప్లేయర్ సర్కార్ శివనాథ్ వయస్సు 56 ఏళ్లు. బ్రిడ్జి అంటే పేకాట, ఆసియా క్రిడల్లో ఇది ఒక ఈవెంట్. బ్రిడ్జిలో చైనాపై భారత్ 384-378 తేడాతో గెలిచి స్వర్ణం దక్కించుకుంది. ఈ రెండు స్వర్ణాలతో భారత్ పతకాల సంఖ్య 67కి చేరింది. వీటిలో 15 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి. 67 మెడల్స్‌తో భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

Comments

comments

Related Stories: