ఎస్సి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థత

  రంగారెడ్డి : కొత్తూర్ మండలంలోని ఎస్సి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు భోజనం చేసి అస్వస్థతకు గురైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ఈ రోజు 11 గంటలకు ఇంటర్వేల్ తర్వాత ఆడుకొని తరగతి గదిలోకి వెళుతుండగా ఘాటైనా వాసన రావడంతో పిల్లలు, టీచర్లు బయటకు వచ్చినట్టు నవణిత అనే విద్యార్థిని తెలిపింది. భోజనం చేసిన కొద్దిసేపటికి వాంతులు కావడంతో కొంత మంది విద్యార్థులను ఇళ్ళకు పంపించారని చెప్పింది. […] The post ఎస్సి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి : కొత్తూర్ మండలంలోని ఎస్సి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు భోజనం చేసి అస్వస్థతకు గురైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ఈ రోజు 11 గంటలకు ఇంటర్వేల్ తర్వాత ఆడుకొని తరగతి గదిలోకి వెళుతుండగా ఘాటైనా వాసన రావడంతో పిల్లలు, టీచర్లు బయటకు వచ్చినట్టు నవణిత అనే విద్యార్థిని తెలిపింది. భోజనం చేసిన కొద్దిసేపటికి వాంతులు కావడంతో కొంత మంది విద్యార్థులను ఇళ్ళకు పంపించారని చెప్పింది. ఇదిలా ఉండగా 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు కొత్తూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు చికిత్స అందించిన డాక్టర్ దామోదర్‌ను వివరణ కోరగా మంచి నీటి నుండి, భోజనం ద్వారా కాని, వాయు కాలుష్యం వల్ల కాని రావచ్చని అన్నారు. వాటిని ల్యాబ్‌కు పంపిస్తే తెలుస్తుందని అన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి అపాయం లేదని వెల్లడించారు.

14 Students ill at SC Girls Residential School in Kothur

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్సి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: