‘బాబ్లీ’ గేట్లు ఎత్తివేత

  బాసర: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14గేట్లలో బుధవారం విడతల వారీగా ఒక్కో గేటును కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో ఎత్తివేశారు. జూలై ఒకటి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు దిగువనకు నీరు వదలనున్నారు. అత్రి సభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ… శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1091 అడుగులకు గాను 1070.4 (29.722 టిఎంసిలు) అడుగుల నీరు ఉందన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌లో 17.8 ఎంఎం క్యూసెక్కులు, విష్ణుపురి ప్రాజెక్ట్‌లో 30.65 ఎంఎం క్యూసెక్కులు, అమ్దురా ప్రాజెక్ట్‌లో […] The post ‘బాబ్లీ’ గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాసర: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14గేట్లలో బుధవారం విడతల వారీగా ఒక్కో గేటును కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో ఎత్తివేశారు. జూలై ఒకటి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు దిగువనకు నీరు వదలనున్నారు. అత్రి సభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ… శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1091 అడుగులకు గాను 1070.4 (29.722 టిఎంసిలు) అడుగుల నీరు ఉందన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌లో 17.8 ఎంఎం క్యూసెక్కులు, విష్ణుపురి ప్రాజెక్ట్‌లో 30.65 ఎంఎం క్యూసెక్కులు, అమ్దురా ప్రాజెక్ట్‌లో 13.93 ఎంఎం క్యూసెక్కులు, బాలేగాం ప్రాజెక్ట్‌లో 21 ఎంఎం క్యూసెక్కుల నీరు ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఏడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోందని తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు బాసరకు బాబ్లీ నుంచి నీరు చేరే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారి శ్రీనివాసులు, ఎస్‌ఆర్‌ఎస్‌పి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జగదీష్, రామారావు, ఆంధ్రప్రదేశ్ ధవళేశ్వరం ఈఈ మోహన్‌రావు, బాబ్లీ ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిలకంఠ దవళె, అనిల్ పడవళె, బాబ్లీ పచవ్ బందర సమితి అధ్యక్షులు మిసాళే పాల్గొన్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ‘బాబ్లీ’ గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: