బీమా కంపెనీలకు రూ.12 వేల కోట్లు!

Insurance

 

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ తర్వాత ప్రభుత్వం బీమా కంపెనీలను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లలో ప్రభుత్వం రూ.12 వేల కోట్లను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇది జరిగితే ఈ కంపెనీలు రెగ్యులేటరీ నిబంధనలను పూర్తి చేస్తాయి. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం బ్యాంకులకు మూలధనంగా రూ.70 వేల కోట్లు ఇస్తామని ప్రకటించింది. గత వారం ఈ మొత్తంలో రూ.55,250 కోట్లను వివిధ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టింది.

మరోపక్కది నోడల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రభుత్వ బీమా కంపెనీల్లో రూ.12 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. గత ఏడాది మూడు ప్రభుత్వ రంగ బీమా సంస్థలను విలీనం చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే వివిధ కారణాల వల్ల వీటి విలీనం సాధ్యం కాలేదు. ఈ కంపెనీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండడం కూడా దీనికి ఒక కారణం.ఈ దృష్ట్యా ప్రభుత్వం ఈ కంపెనీలలో రూ.12 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం చేసి విలీనానికి మార్గం సుగమం చేయాలని అనుకుంటోంది. ఈ కంపెనీల విలీనం తర్వాత భారత్‌లో అతిపెద్ద బీమా సంస్థగా ఇది అవతరించనుంది.

12000 crore in state general insurance firms

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బీమా కంపెనీలకు రూ.12 వేల కోట్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.