వయసేమో 12…. రాసింది 135 పుస్తకాలు

  ఈ అబ్బాయి పేరు మృగేంద్రరాజ్. వయసు 12ఏళ్లు. వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫజియాబాద్. ఇతను ఇప్పటికీ 135 పుస్తకాలు రాశాడు. మృగేంద్రరాజ్ ఆరేళ్ల వయసున్నప్పుడే పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే పోయమ్స్‌తో మొదటి పుస్తకం రాశాడు. రామాయణంలోని 51పాత్రల గురించి విశ్లేషిస్తూ రాసిన పుస్తకాలంటే తనకు ఎంతో ఇష్టమట. వీటిలో కొన్ని ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీలు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోఢీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్… లాంటివారి జీవిత చరిత్రలను కూడా రాశాడు. ఇవన్నీ 25 […] The post వయసేమో 12…. రాసింది 135 పుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ అబ్బాయి పేరు మృగేంద్రరాజ్. వయసు 12ఏళ్లు. వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫజియాబాద్. ఇతను ఇప్పటికీ 135 పుస్తకాలు రాశాడు. మృగేంద్రరాజ్ ఆరేళ్ల వయసున్నప్పుడే పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే పోయమ్స్‌తో మొదటి పుస్తకం రాశాడు.
రామాయణంలోని 51పాత్రల గురించి విశ్లేషిస్తూ రాసిన పుస్తకాలంటే తనకు ఎంతో ఇష్టమట. వీటిలో కొన్ని ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీలు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోఢీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్… లాంటివారి జీవిత చరిత్రలను కూడా రాశాడు. ఇవన్నీ 25 నుంచి 100 పేజీల్లోపు హిందీలో ఉంటాయి. సుమంత్, రామ్, పినాక్, ప్రహస్త్.. లాంటి పేర్లతో వాటిని రాశాడు.
గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికారడ్స్‌లో చిన్నప్పుడే ఎక్కువ బయోగ్రఫీలు రాసిన పిల్లాడిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఎందరో ప్రముఖుల చేతుల మీదిగా బహుమతులు కూడా అందుకున్నాడు.
రాజ్ వాళ్ల అమ్మ సుల్తాన్‌పూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో టీచర్. వాళ్ల నాన్న ఉత్తర్‌ప్రదేశ్ సుగర్ ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. రాయడంపై ఈ పిల్లాడికున్న ఆసక్తిని గమనించి వీళ్లు తనను ప్రోత్సహించడం మొదలుపెట్టారు.
మంచి రచయిత అవ్వాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నాడు. భవిష్యత్తులో మరెన్నో అంశాలపై ఇంకెన్నో బుక్స్ రాస్తానని చెబుతున్నాడు.

12 Years old boy has written 135 books in UP

The post వయసేమో 12…. రాసింది 135 పుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.