కుక్క కాటుకు 12 మేక పిల్లలు మృతి

  కోట్‌పల్లి : కుక్క కాటుకు 12 మేక పిల్లలు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన అనంతగిరి అనంతయ్య ఇంట్లో లేని సమయంలో ఇంటి ముందు 12 మేకపిల్లలు మృతి చెందడడందో ఇరుగు పొరుగు వారు సంబంధిత వెటర్నరీ డాక్టర్ నర్సిములుకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న డాక్టర్ పరిశీలించగా కుక్క కాటుకు మృతిచెందాయని అందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. ఒక్కసారిగా 12 మేకలు […] The post కుక్క కాటుకు 12 మేక పిల్లలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోట్‌పల్లి : కుక్క కాటుకు 12 మేక పిల్లలు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన అనంతగిరి అనంతయ్య ఇంట్లో లేని సమయంలో ఇంటి ముందు 12 మేకపిల్లలు మృతి చెందడడందో ఇరుగు పొరుగు వారు సంబంధిత వెటర్నరీ డాక్టర్ నర్సిములుకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న డాక్టర్ పరిశీలించగా కుక్క కాటుకు మృతిచెందాయని అందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.

ఒక్కసారిగా 12 మేకలు బలి కావడంతో రైతు లబోదిబోమంటు ఏడవసాగారు. దాదాపుగా ఆస్తి నష్టం రూ 50 వేలు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన రైతు అనంతగిరి అనంతయ్యకు ఉన్న 12 మేక పిల్లలు ఒక్కసారిగా కుక్క కాటుకు మరణించడంతో రైతు కుటుంబానికి జరిగిన ఆస్తి నష్టం చెల్లించాలని స్థానిక సర్పంచ్ పాండురంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

12 goats killed in dog bite

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుక్క కాటుకు 12 మేక పిల్లలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: