తాలిబన్ల దాడిలో 12మంది మృతి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు గజనీ ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిఘా అధికారులను టార్గెట్ చేసుకుని తాలిబన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. తాలిబన్ల దాడిలో మృతి చెందినవారిలో 8 మంది నేషనల్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డిఎస్‌)కు చెందిన వారు ఉండగా, నలుగురు […] The post తాలిబన్ల దాడిలో 12మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు గజనీ ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిఘా అధికారులను టార్గెట్ చేసుకుని తాలిబన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. తాలిబన్ల దాడిలో మృతి చెందినవారిలో 8 మంది నేషనల్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డిఎస్‌)కు చెందిన వారు ఉండగా, నలుగురు సాధారణ పౌరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే  ఈ దాడికి తామే పాల్పడినట్టు తాలిబన్ ఉగ్రవాదులు ఓ ప్రకటన చేశారు. నిఘా అధికారుల ఆఫీసు ప్రాంగణంలో ఈ దాడులు జరిగాయని, ప్రాంగణంలో ఉన్న 50 మంది సాధారణ పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  అయితే ఖతర్ రాజధాని దోహాలో తాలిబన్ ప్రతినిధులకు, అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో తాలిబన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

12 Dead In Talibans Attack At Afghanistan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాలిబన్ల దాడిలో 12మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: