119 గురుకుల సంక్షేమ పాఠశాలలు మంజూరు…

హైద‌రాబాద్‌: బిసిల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలల ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బిసి, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బిసిలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సిఎఎం కిసిఆర్ ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనిలో భాగంగానే ఇటివల జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం […]

హైద‌రాబాద్‌: బిసిల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలల ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బిసి, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బిసిలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సిఎఎం కిసిఆర్ ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనిలో భాగంగానే ఇటివల జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణ‌యానికి అనుగుణంగా 119 బిసి గురుకులాలను మంజూరు చేస్తూ బిసి సంక్షేమ‌శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.