తొలివిడత పరిషత్ ఎన్నికలకు 1100 మంది పోలీసు బందోబస్తు

ఆదిలాబాద్‌ః ప్రాదేశిక ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. 271 పోలింగ్ కేంద్రాల్లో 189 సాధారణం, 82 సమస్యాత్మక మైనవిగా గుర్తించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేకంగా బందోబస్తు పర్యవేక్షణ చేపడుతున్నారు. 40 మంది నిఘా పోలీసు అధికారులను నియమించి పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పట్లపై పరోక్షంగా సమీక్షిస్తున్నారు. ప్రతి గ్రామాల్లో పోలీస్ అధికారులు పర్యటించి ప్రశాంత వాతావరణం కల్పించారు. రెండు రోజుల […] The post తొలివిడత పరిషత్ ఎన్నికలకు 1100 మంది పోలీసు బందోబస్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్‌ః ప్రాదేశిక ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. 271 పోలింగ్ కేంద్రాల్లో 189 సాధారణం, 82 సమస్యాత్మక మైనవిగా గుర్తించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేకంగా బందోబస్తు పర్యవేక్షణ చేపడుతున్నారు. 40 మంది నిఘా పోలీసు అధికారులను నియమించి పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పట్లపై పరోక్షంగా సమీక్షిస్తున్నారు. ప్రతి గ్రామాల్లో పోలీస్ అధికారులు పర్యటించి ప్రశాంత వాతావరణం కల్పించారు. రెండు రోజుల ముందే పోలింగ్ స్టేషన్లల్లో బందోబస్తు పోలీసులను కేటాయించి ఆధీనంలో తీసుకుంటారు. పకడ్భందీగా ఆదేశిక ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర సరిహద్దుల్లో కూబింగ్ ప్రారంభించిన జిల్లా ప్రత్యేక పోలీసులు, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను నియమించి నిరంతరం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో పరస్పర సమాచార వ్యవస్థను పటిష్టపరుచుకున్నామని వెల్లడించారు. పూర్వ ఎన్నికల నిర్వహణ అనుభవంతో మరింత ప్రణాళికాబద్దంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోని, ప్రజల నుండి సహకారం లభిస్తుందని అంటున్నారు. మొదటి విడత ఎన్నికల్లో 1100 మంది జిల్లా పోలీసులు పాల్గొంటున్నారు.

1100 policemen arranged For First Phase zptc elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తొలివిడత పరిషత్ ఎన్నికలకు 1100 మంది పోలీసు బందోబస్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: