రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి

రాంచీ : జార్ఖండ్‌లోని హజారీబాగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని, ఈ క్రమంలో బస్సు బ్రేకులు ఫేయిల్ కావడంతో ట్రక్కుపైకి దూసుకెళ్లిందని […] The post రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాంచీ : జార్ఖండ్‌లోని హజారీబాగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని, ఈ క్రమంలో బస్సు బ్రేకులు ఫేయిల్ కావడంతో ట్రక్కుపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసంమైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

11 Passengers Dead in Road Accident At Jharkhand

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.