108 వాహనంలో మహిళ ప్రసవం..

Pregnency Women Delivery In 108 Vehicyle In Medchal

శామీర్‌పేట : 108 అత్యవసర వాహనంలో ఓ మహిళ ప్రసవించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం పురిటి నోప్పులు వస్తున్నాయని 108 వాహనానికి సమాచారం ఇవ్వగా మూడు చింతలపల్లి నుంచి గజ్వేల్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో మహిళ ప్రసవించి శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమమేనని ఈఎంటి పల్లం రాజు ఫైలెట్ మల్లారెడ్డి తెలిపారు.