108 యేళ్ళ పోలీస్ పటేల్‌…

 108 years old Man Still Live
జుక్కల్: నేటి రోజుల్లో ప్రతి మనిషి అరవై యేళ్ళకే ఆయుష్షు అయిపోతుందని భధ్రత గురించి ఆందోళణ చెందుతున్న క్రమంలో మండలంలోని లాడేగాం గ్రామానికి చెందిన ఒక అప్పటి పోలీస్‌పటేల్‌ గా విధులు నిర్వహించిన దేవ్‌కత్తే మారుతి ఇంకా బతికే ఉన్నాడు. అతను ఆరోగ్యంగా ఉండటం చూసిన ప్రతి ఒక్కరు కొనియాడకుండా ఉండలేరనిపిస్తోంది. అతనికి ఇప్పుడు 108 యేళ్ళని ఆయన కుమారుడు జగ్గుపటేల్ తెలిపారు. ఆ వృద్ధుడు రోజు వారిగా అందరిలాగే టిఫిన్‌లు, చాయ్‌లు లాంటివేవి ముట్టుకోలేదని అంటున్నారు. ఉదయం, రాత్రికి రెండు జొన్న రొట్టేలతో భోజనం చేస్తారు. ఎలాంటి అలవాట్లు కూడ లేవు. ఇంటికి వచ్చిన వారితో తప్పకుండా మాట్లాడుతారు. కళ్ళు కూడా సక్రమంగానే కనిపిస్తాయి. గత జ్ఞాపకాలు కొన్ని మన తెలంగాణతో పంచుకున్నారు…ఆ విషయాలు కొన్ని చూద్దాం. స్వాతంత్య్రం రాక ముందు అప్పటి తెలంగాణలో ఆయన పోలీస్‌పటేల్ అంటే ఇప్పుడు గ్రామ పోలీస్‌ లాగా పరిగణిస్తున్నారు. కర్ణాటక ఔరాద్ అమీన్ కచేరి (పోలీస్‌స్టేషన్)లో విధులు నిర్వహించేవారు. వారికి కర్ణాటక బెంగళూరు సేషన్ కోర్టుగా ఉండేదని, జిల్లా బీదర్‌గా, జన్‌వాడ తాలుకాగా ఉండేదన్నారు. ఈయన నిజాం సర్కార్ పాలనలో విధులు నిర్వహించారు. ఫస్తకోం (దళితోద్యమం), జైహింద్ (భారత దేశం కోసం సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయరు చేసిన) కాలంలో కూడ ఉన్నారు. ఆయన 55 యేళ్ళ పాటు పోలీస్‌పటేల్‌గా విధులు నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నట్లు పేర్కోన్నారు. ఇప్పటికి ఆయన మూడి ఉర్దులో సంతకం చేస్తారు. యేదేమైన ఇన్నేళ్ళ పాటు ఆరోగ్యంగా బతకడం నేటి తరానికి ఆదర్శం.

Comments

comments