108లో మహిళ ప్రసవం…

 Woman in Childbirth in 108 in Adilabad District

ముథోల్: తానూరు మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన విజయవతి అనే మహిళ 108 వాహనంలో ఇద్దరు కవల పిల్లలకు సోమవారం జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చించాల గ్రామంలో అక్క ఇంటికి వచ్చిన ఏడు నెలల గర్భవతి విజయవతి అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది భైంసా ఏరియా దవాఖానకి తరలిస్తుండగా తరోడ గ్రామ సమీపాన ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. భైంసా దవాఖానకు తరలించిన ఈఏంటి సాయన్న, పైలట్ నస్రూల్లాఖాన్‌కు కుటుంబీకులు, మహిళ బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

comments