108లో మహిళ ప్రసవం…

ఖానాపూర్‌ః పెంబి మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజుల రాజవ్వ అనే నిండు గర్భిణి శుక్రవారం రాత్రి 108 వాహనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. పోత రాజుల రాజవ్వకు ఇది 4వ కాన్పు కాగా 3 కాన్పుల్లో ఆడ పిల్లలే పుట్టడంతో 4వ కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న రాజవ్వ శుక్రవారం పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా రాజవ్వను పరిక్షించిన ఆరోగ్య సిబ్బంది ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో […]

ఖానాపూర్‌ః పెంబి మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజుల రాజవ్వ అనే నిండు గర్భిణి శుక్రవారం రాత్రి 108 వాహనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. పోత రాజుల రాజవ్వకు ఇది 4వ కాన్పు కాగా 3 కాన్పుల్లో ఆడ పిల్లలే పుట్టడంతో 4వ కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న రాజవ్వ శుక్రవారం పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా రాజవ్వను పరిక్షించిన ఆరోగ్య సిబ్బంది ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గర్బిణిని కుటుంబ సభ్యులు ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రాజవ్వకు కాన్పు కష్టంగా ఉందని నిర్మల్ కు తరలించాలని సూచించారు. దీంతో 108 సహాయంతో ఖానాపూర్ నుండి నిర్మల్‌కు తీసుకెళ్తుండగా రత్నపూర్ కాండ్లి వద్ద మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎన్‌టి వెంకటేష్‌గౌడ్ పురుడు పోసి తల్లిబిడ్డను రక్షించారు. ఎలాంటి ఆపాయం జరుగకుండా పురుడు పోసి నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Related Stories: