108లో ఉద్యోగుల తొలగింపు…

హైదరాబాద్: సమ్మె చేస్తున్న 620 మంది 108 ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించినట్లు తెలంగాణ రాష్ట్ర జివికె, ఇఎమ్ఆర్ఐ 108 సర్వీసెస్ స్టేట్ హెడ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు తెలిపారు. కొందరు ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 19లోగా నియమ నిబంధనల ప్రకారం తిరిగి విధుల్లోకి చేరే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 19లోపు విధుల్లోకి చేరకపోతే సంస్థలో శాశ్వతంగా ఇక చేరలేరని ఆయన చెప్పారు. పిపిపి రద్దు చేయాలన్న డిమాండ్ తమ పరిధిలో […]

హైదరాబాద్: సమ్మె చేస్తున్న 620 మంది 108 ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించినట్లు తెలంగాణ రాష్ట్ర జివికె, ఇఎమ్ఆర్ఐ 108 సర్వీసెస్ స్టేట్ హెడ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు తెలిపారు. కొందరు ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 19లోగా నియమ నిబంధనల ప్రకారం తిరిగి విధుల్లోకి చేరే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 19లోపు విధుల్లోకి చేరకపోతే సంస్థలో శాశ్వతంగా ఇక చేరలేరని ఆయన చెప్పారు. పిపిపి రద్దు చేయాలన్న డిమాండ్ తమ పరిధిలో లేదని, ప్రభుత్వ పరిధిలో ఉందని బ్రహ్మానందరావు చెప్పారు.