ఓటేసింది ఒక్కడే.. పోలింగ్ మాత్రం 100 పర్సెంట్…

Bharatdas Darshandasగాంధీనగర్: ఆ పోలింగ్ బూత్ లో నమోదైన ఓటింగ్ పర్సెంట్ వంద. కానీ, అక్కడ ఓటు వేసింది మాత్రం ఒకే ఒక్కడు. ఇదేంటి 100 పర్సెంట్ ఓటింగ్ అంటే ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఉన్నవాళ్లు అందరూ ఓటు వేస్తేనే కదా 100 శాతం పోలింగ్ నమోదయ్యేది. మీరేమో ఒక్కడే ఓటు వేశాడు అంటున్నారు. మరి 100 పర్సెంట్ పోలింగ్ ఎలా నమోదైంది. ఇదేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. గుజరాత్ రాష్ట్రంలోని జూనాగడ్ పరిధిలోగల గిర్ అటవీ ప్రాంతంలో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లు ఎంతమంది తెలుసా? ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే. అతడి కోసమే అధికారులు ఆ అటవీ ప్రాంతంలో పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అతనేవరో కాదు… భరత్‌దాస్. మంగళవారం జరిగిన మూడవ దశ పోలింగ్‌లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటేసిన తరువాత భరత్‌దాస్ మీడియాతో మాట్లాడాడు. నేను ఓటేశాను. ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైంది. ఇదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతీచోట 100 పర్సెంట్ పోలింగ్ నమోదు కావాలని కోరుకుంటున్నాను. అది జరగాలంటే ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పుకొచ్చాడు. ప్రతీ ఓటు విలువైనదే అనే దానికి ఇదే మంచి ఉదాహరణ.

100% voter turnout in Gujarat Gir Forest

The post ఓటేసింది ఒక్కడే.. పోలింగ్ మాత్రం 100 పర్సెంట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.