100 ఏనుగుల ఊచకోత!

ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బోట్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగడంతో సుమారు వంద ఏనుగులు విగతజీవులై కనిపించాయి. జూలై 10వ తేదీ నుంచి ఈ ఊచకోత చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ప్రతిరోజూ ఇంకా కళేబరాలు కనిపిసూనే ఉన్నాయి అని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ […]

ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బోట్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగడంతో సుమారు వంద ఏనుగులు విగతజీవులై కనిపించాయి. జూలై 10వ తేదీ నుంచి ఈ ఊచకోత చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ప్రతిరోజూ ఇంకా కళేబరాలు కనిపిసూనే ఉన్నాయి అని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ తెలిపారు. ఇప్పటిదాకా ఆఫ్రికాలో ఇంతఘోరం జరగలేదని ఆయన వాపోయారు. ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత ఊచకోత చోటుచేసుకున్నదని ఆయన వివరించారు.

Related Stories: