డెంగ్యూతో బాలిక మృతి…

ధర్మారం: అల్క సుజాని (10) బాలిక డెంగ్యూ వ్యాధితో గురువారం అర్థరాత్రి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారంలోని ప్రధాన రహదారి ప్రక్కన్న నివాసముండే జర్నలిస్ట్ అల్క సుధాకర్  ఓ దిన పత్రికలో విలేకరి పని చేస్తున్నాడు. కూతూరు అల్క సుజాని కి తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం రాత్రి కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సుజానికి డెంగ్యూ తోడుకావడంతో […]

ధర్మారం: అల్క సుజాని (10) బాలిక డెంగ్యూ వ్యాధితో గురువారం అర్థరాత్రి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారంలోని ప్రధాన రహదారి ప్రక్కన్న నివాసముండే జర్నలిస్ట్ అల్క సుధాకర్  ఓ దిన పత్రికలో విలేకరి పని చేస్తున్నాడు. కూతూరు అల్క సుజాని కి తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం రాత్రి కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సుజానికి డెంగ్యూ తోడుకావడంతో పరిస్థితి విషమించింది. గురువారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే  చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. జర్నలిస్ట్ సుధాకర్ గత మూడేళ్ళ నుండి ప్రెస్ కాలనీలో నివాసముంటున్నారు. ప్రెస్ కాలనీ వెనుక వైపు పెద్ద ఎత్తున నీరు వచ్చి చెరువును తలపిస్తున్న వైనాన్ని గత పక్షం రోజుల క్రితమే మన తెలంగాణ ప్రచురించినఅధికారులు  స్పందించలేదు. దీంతో దోమలు సమృద్ది చెంది డెంగ్యూ వాతావరణంలో సుజాని మృతి చెందింది. ఇది ఇలా ఉండగా గత పదకొండు నెలల క్రితమే సుధాకర్ కుమారుడు సుహస్ మృతి చెందాడు.  ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీర్ మున్నీర్‌గా విలపిస్తున్నారు. జడ్పిటిసి నారబ్రహ్మయ్య, వైస్ ఎంపిపి నారప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు సుధాకర్‌ను కలిసి పరామర్శించారు.

Comments

comments

Related Stories: