విద్యార్థులే ఓనమాలు నేర్పే ఉపాధ్యాయులు

బదిలీ కారణంగా 10 పాఠశాలలకు ఉపాధ్యాయులే లేరు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులకు స్థానచలనం విద్యా వ్యవస్థ అగమ్యగోచరం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం మన తెలంగాణ/గట్టు : మండల పరిధిలోని దాదాపు వందకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో కొన్ని ప్రాథమిక, ప్రాథకోన్నత పాఠశాలలు ఉన్నాయి. మండల పరిధిలోని యల్లందొడ్డి ఎంపిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక శాశ్వత ఉపాధ్యాయురాలు పని చేస్తుండగా ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీపై మల్దకల్ మండలానికి వేళ్ళి […]

బదిలీ కారణంగా 10 పాఠశాలలకు ఉపాధ్యాయులే లేరు
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులకు స్థానచలనం
విద్యా వ్యవస్థ అగమ్యగోచరం
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

మన తెలంగాణ/గట్టు : మండల పరిధిలోని దాదాపు వందకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో కొన్ని ప్రాథమిక, ప్రాథకోన్నత పాఠశాలలు ఉన్నాయి. మండల పరిధిలోని యల్లందొడ్డి ఎంపిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక శాశ్వత ఉపాధ్యాయురాలు పని చేస్తుండగా ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీపై మల్దకల్ మండలానికి వేళ్ళి పోగా టీచర్ లేక పోవడంతో 6, 7తరగతుల విద్యార్థులు 1 నుండి 3 తరగతుల చిన్నారులకు తామే పలకలపై ఓనమాలు రాయించారు. ఒక యల్లందొడ్డి గ్రామంలోనే కాకుండా మండలంలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయు లు లేక ప్రాథమిక పాఠశాలలు తాళాలతో దర్శనమిస్తుండడంతో విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుని పంతుళ్ళు లేక పోవడంతో నిరాశతో ఇంటికి వెళ్ళి పోతున్నారు. తమ తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నించగా బడికి తాళం వేసి ఉందని మాస్టారు రాలేదని సమాధానం ఇవ్వడంతో వారు తమ పిల్లలను పోలం పనులకు తమతో పాటు తీసుకుని వేళ్ళుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉందా అని తమకు తాముగా ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యాధికారులు గ్రామానికి దగ్గరలో పాఠశాల ఉపాధ్యాయునికి ఇన్‌చార్జీ బాధ్యలు అప్పగించడమో లేద నామ మాత్రంగా విద్యా వాలేంటర్లను ఏర్పాటు చేయ్యవలసి ఉండగా ఎలాంటి ప్రణాళిక చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ జీవో ప్రకారంగా ఉపాధ్యాయులను చేసి వారు ఎంపిక చేసుకు న్న పాఠశాలకు స్థాన చలనం చేశారు. కాని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉం చుకోకుండా ఇలా చేయ్యడం ద్వారా విద్యలో వెనుకబడిన గట్టు మండలం గ్రా మాలలో ప్రభుత్వ పాఠశాలలు లేని మండలంగా గుర్తింపు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం విద్యాభివృధ్ధికై గట్టు మండలాన్ని ఏజేన్సి ప్రాంతంగా గుర్తించి మండలానికి ప్రత్యేక నిధులను కేటాయించి ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా విద్య వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు స్థాన చలనం..
విద్యా వాలేంటర్లను నియమిస్తాం : ఎంఇఒ కొండారెడ్డి
2015లో బదిలీలలో ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకున్న పాఠశాలకు వేళ్ళవలసి ఉండగా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి బదిలీని నామమాత్రంగా నిలిపివేశారని ప్రభుత్వం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జీఓ ఆధారంగా వారి స్థాన చలనం చేశామని ఎంఇఒ కొండా రెడ్డి మన తెలంగాణకు తెలిపారు.ఒక ఎల్లందొడ్డి కాకుండా దాదాపు మండలంలోని 10ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరన్నారు.మరో రెండు రోజులలో విద్యావాలేంటర్లను ఏర్పాటుచేస్తామన్నారు. అప్పటి వరకు విద్యార్థుల భవిష్యతు ఏంటి అని ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాలను పాటించామని సమాధానం ఇచ్చారు.

Comments

comments

Related Stories: