10% తగ్గిన హెచ్ 1బి జారీ

  వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాల జారీ భారీ స్థాయిలో తగ్గింది. ఐటి నిపుణులకు కీలకమైన ఈ వీసాల జారీ 2018 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం తగ్గింది. ట్రంప్ అధికార యంత్రాంగం దూకుడు వలసవిధానం, అమెరికా ఫస్ట్ పాలసీతో వీసాల జారీ తగ్గినట్లు స్పష్టం అయింది. అమెరికాలో ఉద్యోగాలకు ఈ వీసాలు అత్యవసరం, అయితే వర్క్ వీసా విధానంపై ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియంత్రణలు విధిస్తూ వస్తున్నారు. భారత్‌కు […] The post 10% తగ్గిన హెచ్ 1బి జారీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాల జారీ భారీ స్థాయిలో తగ్గింది. ఐటి నిపుణులకు కీలకమైన ఈ వీసాల జారీ 2018 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం తగ్గింది. ట్రంప్ అధికార యంత్రాంగం దూకుడు వలసవిధానం, అమెరికా ఫస్ట్ పాలసీతో వీసాల జారీ తగ్గినట్లు స్పష్టం అయింది. అమెరికాలో ఉద్యోగాలకు ఈ వీసాలు అత్యవసరం, అయితే వర్క్ వీసా విధానంపై ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియంత్రణలు విధిస్తూ వస్తున్నారు. భారత్‌కు చెందిన ఐటి వృత్తి నిపుణులు అత్యధిక సంఖ్యలో ఈ హెచ్ 1 బి వీసాలతో అమెరికాకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో రెన్యూవల్స్‌ను కలిపి చూస్తే మొత్తం 3,35,000 వీసాలను మంజూరు చేశారు. అయితే అంతకు ముందు ఏడాది 2017లో జారీ అయినవి 3,73,400. ఈ మేరకు వీసాలలో పదిశాతం కోత పడింది.

2017లో వచ్చిన ప్రతి వంద దరఖాస్తులలో 93 వరకూ ఆమోదం పొందాయి. ఇక 2018లో వందకు 85 దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్ దక్కిందని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ (యుఎస్‌సిఐఎస్) గణాంకాలతో వెల్లడైంది. ఏడాదిలో తగ్గిన ఈ వీసాల జారీ గురించి ది మెర్కురీ న్యూస్ పత్రికలో వలస విధాన విశ్లేషణా సంస్థ పరిశీలకుడు సరా పియర్స్ విశ్లేషించారు. ట్రంప్ అధికార యంత్రాంగం దూకుడు ఈ వీసాల జారీతో వెల్లడయిందని , హెచ్ 1 బి వీసాల వాడకంపై ట్రంప్ యంత్రాంగం కట్టడి విధించింది. వలసల అధికార సంస్థ విశ్లేషణలతో ఈ విషయం స్పష్టం అయిందని పియర్స్ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్ 1 బి వీసాల ఆమోద స్థాయి రెన్యూవల్స్‌తో కలిపి చూస్తే కేవలం 73 శాతానికి దిగజారిందని పత్రిక వ్యాసంలో తెలిపారు. కొన్ని కంపెనీలు ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగ పరుస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అధికార యంత్రాంగం జారీని కటుతరం చేసింది. వర్క్ వీసాలను ఐటి కంపెనీలు ఇష్టారాజ్యంగా వాడుకుంటూ, వాటిని దుర్వినియోగపరుస్తున్నాయని, దీనితో అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదని ట్రంప్ స్వయంగా మండిపడ్డారు. రెండేళ్ల క్రితం ట్రంప్ కీలక కార్యనిర్వాహకులు ఆదేశాలు వెలువరించారు. అమెరికా వస్తువులనే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండనే ఈ ఆదేశాలతో ఇక్కడ ఉంటున్న భారతీయ ఐటి నిపుణుల ఉద్యోగ భద్రతకు గండి పడింది. ఇక ముందు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

10 percent decrease in H1B visa approvals in 2018

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 10% తగ్గిన హెచ్ 1బి జారీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: