బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

Road Accident

 

రంగారెడ్డి: బస్సు బోల్తాపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతం మదనపల్లి రోడ్డు వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సును రోడ్డు పైనుంచి క్రేన్ సహాయంతో తొలగిస్తుండగా క్రేన్ కూడా బోల్తాపడింది. మరో పెద్ద క్రేన్ తీసుకొచ్చి రెండు వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. దీంతో రెండు గంటల రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

 

10 Members Injured in Bus Accident in Rangareddy

The post బస్సు బోల్తా: 10 మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.