పతకం పట్టుకొచ్చిన మన పసిడి సింధు

  తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మరే భారత క్రీడాకారులకు సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 10 పతకాలు గెలవగా.. ఇందులో పీవీ సింధు గెలిచిన పతకాలే ఐదు. ఆ ఐదులో రెండు రజతాలు, రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం ఉండగా.. భారత్‌కి లభించిన ఏకైక పసిడి పతకాన్ని సింధూనే గెలవడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని […] The post పతకం పట్టుకొచ్చిన మన పసిడి సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మరే భారత క్రీడాకారులకు సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 10 పతకాలు గెలవగా.. ఇందులో పీవీ సింధు గెలిచిన పతకాలే ఐదు. ఆ ఐదులో రెండు రజతాలు, రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం ఉండగా.. భారత్‌కి లభించిన ఏకైక పసిడి పతకాన్ని సింధూనే గెలవడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ షట్లర్ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు గెలుపొందిన విషయం తెలిసిందే.

 

కల నెరవేర్చింది మా అమ్మాయి: కుమార్తె సింధు సాధించిన స్వర్ణపతకానికి తల్లి విజయ సంతోషిస్తూ…“2017, 2018లో వరుసగా ఫైనల్లో ఓడిన పీవీ సిం ధు.. ఈసారి స్వర్ణం గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నాను. మా కల నేరవేరింది. నా పుట్టిన రోజుకి మా అమ్మాయి ఇంత గొప్ప బహుమతి ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది” అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

పసిడి పతకం అమ్మకే అంకితం: వరుసగా 2017, 2018 ఫైనల్లో నేను ఓడిపోయాను. అందుకే ఈ ఏడాది ఫైనల్లో గెలవడం నాకు చాలా ముఖ్యం. ఇక్కడ నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకి థ్యాంక్స్. ఈరోజు మా అ మ్మ పుట్టినరోజు.. అం దుకే ఈ పసిడి పతకా న్ని ఆమెకి అంకితం చేస్తున్నాను. నా కోచ్ గోపీచంద్, కో చింగ్ స్టాఫ్‌లో ఉన్న కొరియాకి చెందిన కిమ్ జిహున్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటోంది.

ప్రశంసల వర్షం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలిచి తొలి భారత షట్లర్‌గా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పీవీ సింధు నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పొగుడుతూ ప్రశంసల్లో ముంచెత్తారు.
1. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళ పీవీ సింధు. కంగ్రాట్స్ ఛాంపియన్. మేం గర్వించేలా చేశావు.
                                                                                                               – విజయ్ దేవరకొండ
2. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి భారత్‌కు బంగారు పతాకం గెలుచుకొని తెచ్చిన గోపీచంద్, సింధులకు శుభాకాంక్షలు.
                                                                                                                        – నాగార్జున
3. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలుపొందిన పీవీ సింధుకు హృదయ పూర్వక అభినందనలు. ఎస్.. ఎస్.. సూపర్.
– మంచు విష్ణు
4. దేశంలోని ఎంతోమందికి ఈ విజయం స్ఫూర్తిదాయకం. నీ పట్ల చాలా గర్వంగా ఉంది. దేశం గర్వించేలా చేశావు. శుభాకాంక్షలు
-రకుల్
5. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన సింధుకు ప్రత్యేక అభినందనలు. మరోసారి మన దేశం గర్వించేలా చేశావు. నీవు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా.
  -మోహన్ బాబు
6. సింధు ఓ ఆడపులి.. ఎంత గొప్పగా ఆడారు. కంగ్రాట్స్.. నీకు ప్రత్యేక శుభాకాంక్షలు.
– ఛార్మి
7. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు బంగారానివి సింధు.
-సింధు చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్

10 medals for India at World Championships

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పతకం పట్టుకొచ్చిన మన పసిడి సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.