రిమ్స్‌లో ఇంజక్షన్ వికటించి 10మంది చిన్నారులకు అస్వస్థత

  ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. రిమ్స్ పిల్లల వార్డులో వివిధ వ్యాధులతో అడ్మిట్ అయిన 30 మంది చిన్నారులకు రోజులాగే ఉదయం డ్యూటీలో ఉన్న నర్సులు యాంటిబయోటిక్ అయిన సెఫో టాక్షిమ్ ఇంజక్షన్ ఇచ్చారు. అరగంట తరువాత ఒక్కొక్కరుగా పది మంది చిన్నారులు నీరసం, వణుకు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు […] The post రిమ్స్‌లో ఇంజక్షన్ వికటించి 10మంది చిన్నారులకు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. రిమ్స్ పిల్లల వార్డులో వివిధ వ్యాధులతో అడ్మిట్ అయిన 30 మంది చిన్నారులకు రోజులాగే ఉదయం డ్యూటీలో ఉన్న నర్సులు యాంటిబయోటిక్ అయిన సెఫో టాక్షిమ్ ఇంజక్షన్ ఇచ్చారు. అరగంట తరువాత ఒక్కొక్కరుగా పది మంది చిన్నారులు నీరసం, వణుకు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు విషయం తెలియజేయడంతో వారు చికిత్స ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బానోత్ బలరాం నాయక్ చిన్న పిల్లల వార్డును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

చిన్నారులకు స్వయంగా పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలవడంతో తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ సందర్బంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బానోథ్ బలిరాం నాయక్ మాట్లాడుతూ.. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌ల కోసం అందించే యాంటిబయోటిక్ ఇంజక్షన్ సెఫటాక్షిమ్ ఇచ్చిన తరువాతే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. ఇంజక్షన్‌తో పాటు సిరంజిలను ల్యాబ్‌కు పంపించడం జరిగిందని, దీనికి కారణాలు అన్వేషించి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఇంజక్షన్ కారణంగానా, లేక సిబ్బంది తప్పిదం ఏమైన ఉందా అనే కోణంలోనూ విచారణ చేపడుతామన్నారు. సిబ్బంది నిర్లక్షమని తెలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

10 little girls getting sick with injection in rims

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రిమ్స్‌లో ఇంజక్షన్ వికటించి 10మంది చిన్నారులకు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: