10 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎల రాజీనామా

పనాజీ : కర్నాటకలో రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవాకు చెందిన 15 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలలో 10 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమను బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నాయకత్వంలో ఈ 10 మంది ఎంఎల్ఎలు గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్ కు లేఖ అందించారు.  మూడింట రెండొంతుల మంది ఎంఎల్ఎలు విలీనానికి ఓకే చెప్పడంతో కాంగ్రెస్  శాసనసభా […] The post 10 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎల రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పనాజీ : కర్నాటకలో రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవాకు చెందిన 15 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలలో 10 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమను బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నాయకత్వంలో ఈ 10 మంది ఎంఎల్ఎలు గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్ కు లేఖ అందించారు.  మూడింట రెండొంతుల మంది ఎంఎల్ఎలు విలీనానికి ఓకే చెప్పడంతో కాంగ్రెస్  శాసనసభా పక్షం బిజెపిలో విలీనమైంది. ఈ వ్యవహారంపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. 10 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు బిజెపిలో విలీనమయ్యారని ఆయన చెప్పారు. ఈ పది మంది వారికి వారే స్వచ్ఛందంగా బిజెపిలో చేరినట్టు ఆయన వెల్లడించారు.  గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. బిజెపి-17, కాంగ్రెస్ -15, గోవా పార్వర్డ్-3, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ-1, ఎన్ సిపి-2తో పాటు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. పది మంది రాజీనామా చేయడంతో కాంగ్రెస్ బలం 5 స్థానాలకు పడిపోయింది.

10 Congress MLAs Resign In Goa

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 10 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎల రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.