10 లక్షల కోట్ల పన్ను వసూళ్లు

2017-18లో పెరిగిన దేశీయ ఆదాయం పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 6.92 కోట్ల ఐటి రిటర్న్‌లు: సిబిడిటి గువహటి : గతేడాదిలో రికార్డు స్థాయిలో ఆదా యం పన్ను వసూళ్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం(201718)లో దేశీయ ఆదాయం పన్ను వసూళ్లు రూ.10 లక్షల కోట్లు సాధించినట్టు సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ప్రకటించింది. ఇక్కడ శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల ఈస్టర్న్ జోన్ ఆధాయం పన్ను అధికారుల సమావేశంలో సభ్యుడు షబ్రి బట్టాసాలి మాట్లాడుతూ, 201718లో […]

2017-18లో పెరిగిన దేశీయ ఆదాయం పన్ను వసూళ్లు
రికార్డు స్థాయిలో 6.92 కోట్ల ఐటి రిటర్న్‌లు: సిబిడిటి

గువహటి : గతేడాదిలో రికార్డు స్థాయిలో ఆదా యం పన్ను వసూళ్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం(201718)లో దేశీయ ఆదాయం పన్ను వసూళ్లు రూ.10 లక్షల కోట్లు సాధించినట్టు సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ప్రకటించింది. ఇక్కడ శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల ఈస్టర్న్ జోన్ ఆధాయం పన్ను అధికారుల సమావేశంలో సభ్యుడు షబ్రి బట్టాసాలి మాట్లాడుతూ, 201718లో రికార్డు స్థాయిలో 6.92 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలయ్యాయని అన్నారు. 201617లో దాఖలైన 5.61 కోట్ల రిటర్న్‌లతో పోలిస్తే ఈసారి 1.31 కోట్లు అధికంగా ఐటి రిటర్న్‌లు వచ్చాయని తెలిపారు. 201718 ఆర్థిక సంవత్సరంలో ఐటి శాఖ దాదాపు 1.06 కోట్ల కొత్త రిటర్న్‌లను చేర్చుకోగా, ప్రస్తుత సంవత్సరానికి కొత్త దరఖాస్తుదారులు 1.25 కోట్లు ఉండాలన్నది ఐటి లక్షంగా ఉంది.

ఈశాన్య ప్రాంతంలో ఈ సంఖ్య 1.89 లక్షలుగా ఉందని ఆమె వెల్లడించారు. ఈశా న్య ప్రాంతం ఆదాయం పన్ను అధికారి ఎల్‌సి జోషి రాణి మాట్లాడుతూ, 201718 ఆర్థిక సంవత్సరంలో రూ.7,097 కోట్ల పన్నులను వసూలు చేశామని అన్నారు. అంతకుముందు సంవత్సరం లో రూ.6,082 కోట్లతో పోలిస్తే ఇది 16.7 శాతం వృద్ధిని సాధించామని పేర్కొన్నారు. 201819కి గాను ఈ ప్రాంతంలో రూ.8,357 కోట్ల పన్ను వసూళ్లు లక్షంగా చేసుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ వసూళ్ల లక్షం 17.75 శాతం అధికంగా ఉందని తెలిపారు. ఐటి శాఖ పన్ను వసూళ్లలో లక్ష్యాలనుఅందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. అలాగే పన్ను పరిధిలోకి మరింత మందిని చేర్చుకోవడం, మెరుగైన సేవల దిశగా పనిచేస్తున్నామని అన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో 29 కేంద్రాల్లో ఇప్పటికే 22 ‘ఆయాకార్ సేవా కేంద్రాలు’ ప్రారంభించామని వెల్లడించారు.

Related Stories: