“ఉచితవిద్య” లో 1 నుంచి 3లక్షలు డిపాజిట్

కేశవరెడ్డి కథ అడ్డం తిరిగింది రోజూ రకరకాల మోసాలు, దగాలు వింటున్నాం. కాని కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ నాగిరెడ్డి కేశవరెడ్డి బుర్రకు తట్టిన “కాన్సెప్ట్‌”, దానిని అమలు చేసిన తీరు నభూతో నభవిష్యతి అనవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిని ఈ విద్యావ్యాపారి ఇప్పుడు కటకటాల పాలైనారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40వరకు హైస్కూళ్లు నడుపుతూ అనతికాలంలోనే దూసుకొచ్చిన ఈయనగారి విద్యాలయాల్లో దాదాపు 40వేల విద్యార్థులు చదువుతున్నారు. రెడ్డిగారు తన స్కూళ్లలో ఇతరప్రైవేటు విద్యావ్యాపారులవలె అధికఫీజులు నిర్ణయించకుండా […]

కేశవరెడ్డి కథ అడ్డం తిరిగింది

రోజూ రకరకాల మోసాలు, దగాలు వింటున్నాం. కాని కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ నాగిరెడ్డి కేశవరెడ్డి బుర్రకు తట్టిన “కాన్సెప్ట్‌”, దానిని అమలు చేసిన తీరు నభూతో నభవిష్యతి అనవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిని ఈ విద్యావ్యాపారి ఇప్పుడు కటకటాల పాలైనారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40వరకు హైస్కూళ్లు నడుపుతూ అనతికాలంలోనే దూసుకొచ్చిన ఈయనగారి విద్యాలయాల్లో దాదాపు 40వేల విద్యార్థులు చదువుతున్నారు. రెడ్డిగారు తన స్కూళ్లలో ఇతరప్రైవేటు విద్యావ్యాపారులవలె అధికఫీజులు నిర్ణయించకుండా 10వ తరగతివరకు “ఉచితవిద్య” అందిస్తున్నారు. ఇదెలాసాధ్యం! తమ స్కూల్లో పిల్లల్ని చేర్చే తల్లిదండ్రులకు డిపాజిట్ పథకం ప్రవేశపెట్టారు. పిల్లలు చేరే తరగతినిబట్టి 1 నుంచి 3లక్షలు డిపాజిట్ చేయాలి. 10వ తరగతి చదువు పూర్తయిన తర్వాత డిపాజిట్ వాపస్. ఆ విధంగా ఆయన 11వేలమంది డిపాజిటర్లకు, మరో 800మంది ఇతరులకు ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారట. ఆ రకంగా సేకరించిన మొత్తం రూ.750కోట్లు. స్కూలు భవనాలు, నిర్వహణవ్యయం పోను దానిలో కొంతో, ఎంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు. మార్కెట్ పడకేయటంతో పదోతరగతి పాసైన పిల్లల తల్లిదండ్రులకు డిపాజిట్లు తిరిగి ఇవ్వలేకపోయాడు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో మూడు, పాణ్యంలో రెండు కేసులు దాఖలు కావటంతో – తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ కొత్త ‘కాన్సెప్ట్’ (ఇది ఎ.పి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు మాట) భాగోతం బద్దలైంది. ఇదో కొత్తరకం మోసం. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అతనిపై చట్టప్రకారం చర్య తీసుకుని, డిపాజిటర్లకు డబ్బు తిరిగి ఇప్పించటం ఒక ఎత్తు, కేశవరెడ్డిస్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవటం మరో ఎత్తు. ఇది రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలకు కొత్త సమస్య, సవాలు.

Related Stories: