’ఉన్నది ఒకటే జిందగీ‘ అంటున్న రామ్..!

Ram-15-Title

హైదరాబాద్ : గతేడాది ‘నేను శైలజ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్. తన తర్వాతి చిత్రం హైపర్ తో మరోసారి పరాజయాన్ని రుచి చూశాడు. దీంతో తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో రామ్ తగినంత జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రం కోసం రామ్ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ తో గడ్డం పెంచేసి మంచి రఫ్ లుక్ తో రామ్ తన నెక్ట్స్ మూవీలో కనిపించనున్నాడు.

కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ తదుపరి చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ త్వరలో ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దీంతో అప్పడే రామ్ కొత్త సినిమా టైటిల్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. రామ్ నెక్ట్స్ మూవీకి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అని టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ టైటిల్ గురించి మాత్రం చిత్రం బృందం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Comments

comments