‘ కొడకండ్ల సిద్ధాంతి ’ కన్నుమూత

Warangal : 'Kodakandla Siddhanti' is Passed Away

వరంగల్ రూరల్ : ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కొడకండ్లలోని తన స్వగృహంలో శివైక్యం చెందారు. కొడకండ్ల సిద్ధాంతిగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. గతంలో రవీంద్ర భారతిలో ఆయనకు సన్మానం కూడా జరిగింది. ఈ సన్మాన సమయంలో ఆయనకు ‘ ధార్మిక వరేణ్య ’ బిరుదును ఇచ్చారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఆయనకు స్వర్ణ కంకణాన్ని తొడిగారు. అనంతరం ఆయన్ను పల్లకిలో ఊరేగించారు. ఈ పల్లకిని స్వయంగా కెసిఆర్ మోశారు. కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగం కూడా కొడకండ్ల సిద్ధాంతి చేతుల మీదుగానే జరిగింది. కొడకండ్ల సిద్ధాంతి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, వేద పండితులు సంతాపం తెలిపారు.

‘Kodakandla Siddhanti’ is Passed Away

Comments

comments