‘హ్యాపి వెడ్డింగ్’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. సినిమాలో ప్రేక్షకులు […]

హైదరాబాద్: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రతి పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. నరేష్, మురళీశర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుద‌లైన ‘హ్యాపి వెడ్డింగ్’ ట్రైల‌ర్‌ మీ కోసం.

Comments

comments