‘స్మార్ట్ ఫ్రిజ్’తో స్మార్ట్‌గా షాపింగ్…!

Smart Fridge: A Sign Of Things To Come

షాపునకు, కూరగాయల మార్కెట్‌కు అనుకోకుండా వెళుతూ ఉంటాం. ఇంట్లో ఏమేమి కూరగాయలున్నాయో గుర్తుకు రాదు. అవసరమైన సాస్‌లు గానీ, స్వీట్స్‌లాంటివి కొనాలనుకుంటే ఫ్రిజ్‌లో ఉన్నాయేమే అని అనుమానం వెంటాడుతూటుంది. మరి దీనికి పరిష్కారమేంటి? వెంటనే మీ ఇంటికి
‘స్మార్ట్ ఫ్రిజ్’ను తెచ్చేసుకోండి. మన పనుల్ని మరింత సులభతరం చేసేస్తుంది. దీనికి ఉన్న ఫీచర్స్ తెలుసుకుంటే, ఎవరైనా ముక్కున వేలేసుకోక తప్పదు. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రిజ్. దీనికి వైఫై కనెక్షన్‌తోపాటు ఓ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. దాంతో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలన్నింటినీ మనం డోర్ తెరవకుండానే, బయట ఉన్న ఆ డిస్‌ప్లేలో చూడొచ్చు. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చబడిన కెమెరానే. మనం ఏవైనా పదార్థాలని ఫ్రిజ్‌లో పెట్టగానే డోర్‌లో పెట్టినవాటిని ఫోటో తీసేస్తుంది. ఆ ఫోటోలను మీరు ఆ డిస్‌ప్లేలో కానీ లేదా మొబైల్ ఫోన్‌లో కానీ చూడొచ్చు. షాపింగ్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఒకసారి చెక్ చేసేసుకుని పనిని త్వరగా చేసేసుకోవచ్చు.

Comments

comments