‘సైరా..’కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

Amith-Trivedi

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, రవికిషన్, సుదీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా  ఏ.ఆర్.రెహమాన్, కీరవాణి పేర్లను పరిశీలించారు. కానీ చివరికి  ఈ చిత్రానికి మరో సంగీత దర్శకుడిని ఫైనల్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత త్రివేదిని ఈ సినిమాకు తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన ఈ చిత్రం కోసం ట్యూన్స్ కూడా సిద్ధం చేస్తున్నాడట.