‘సూయీ ధాగా’ ట్రైల‌ర్ సింప్లీ సూపర్బ్…

Sui Dhaaga - Made in India Official Trailer out now

ముంబయి: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా శరత్ కటారియా దర్శకత్వం తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూయీ ధాగా: మేడ్‌ ఇన్‌ ఇండియా’. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్  విడుదల చేసింది. వరుణ్, అనుష్కలు తమ నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మౌజీ, మ‌మ‌త పాత్ర‌ల‌లో వ‌రుణ్‌, అనుష్క న‌టిస్తున్నారు. అనుష్క‌ డీ గ్లామ‌ర్ లుక్ లో చాలా అందంగా క‌నిపించింది. కేంద్ర సర్కార్ ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనుంది. చిత్రీకరణలో సమయంలో తీసిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ తో మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి.

Comments

comments